నాడు పోస్టు చేయడమైనది:
02 NOV 2026 12:42PM by PIB Hyderabad
భారతదేశ సౌర ఇంధనం ఏ విధంగా సరికొత్త అవకాశాలను అందిస్తున్నదీ వివరిస్తూ కేంద్ర మంత్రి శ్రీ ప్రల్హాద్ జోషీ రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావించారు. ఆ వ్యాసం ‘పీఎమ్ సూర్య ఘర్’, ‘పీఎమ్-కుసుమ్’ వంటి కార్యక్రమాలతో భారతదేశంలో సౌర ఇంధన రంగం స్ఫూర్తిని పొంది, శరవేగంగా వృద్ధి చెందుతున్న తీరును వివరించిందని శ్రీ మోదీ అన్నారు.
‘‘భారత్ 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్య సాధన దిశగా దూసుకుపోతోందని, ఈ క్రమంలో వ్యవసాయ రంగంలో సౌర ఇంధనం భూమిక, ఇంధన నిల్వ మొదలుకొని తయారీ రంగం, పర్యావరణానుకూల ఉపాధి కల్పన వరకు.. వివిధ రంగాలలో ముందు ముందు ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతాయో ఆయన ప్రస్తావించారు’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
భారతదేశంలో సౌర ఇంధన రంగం పురోగతి కొత్త కొత్త అవకాశాలను అందిస్తోంది.
‘పీఎమ్ సూర్య ఘర్’, ‘పీఎమ్-కుసుమ్’ వంటి కార్యక్రమాలతో స్ఫూర్తిని పొంది భారతదేశంలో సౌర ఇంధనం వృద్ధి చెందుతున్న తీరుతెన్నులను గురించి కేంద్ర మంత్రి శ్రీ ప్రల్హాద్ జోషీ వివరించారు.
రాబోయే కాలంలో చోటు చేసుకోగల పరిణామాలను గురించి కూడా ఆయన తెలిపారు. భారత్ 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయం, ఇంధన నిల్వ, తయారీ రంగం, పర్యావరణానుకూల ఉద్యోగ కల్పనలలో సౌర ఇంధనం పోషించే పాత్రను వ్యాసంలో తెలిపారు’’ అని పేర్కొన్నారు.