రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అక్టోబర్ 31తో ముగియనున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమం-6... నిర్ణీత లక్ష్యాలను అధిగమించిన భారత రైల్వేలు


పరిశుభ్రత, ప్రయాణికుల సదుపాయాలు, సేవలందించటంపై ప్రయాణికుల నుంచి అభిప్రాయాల సేకరణకు 5,884 రైల్వేస్టేషన్లలో రైల్ జన్ సంవాద్ నిర్వహణ

నాడు పోస్టు చేయడమైనది: 29 OCT 2026 5:33PM by PIB Hyderabad

అక్టోబర్ 2వ తేదీ నుంచి 31, 2026వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమం-6లో భారత రైల్వేలు క్రియాశీలకంగా పాల్గొంటున్నాయి. ఈ ప్రచారం అక్టోబర్ 31తో ముగియనున్న నేపథ్యంలో పెండింగ్ అంశాల పరిష్కారానికి చేపట్టిన ప్రత్యేక ప్రచారంలో (ఎస్‌సీడీపీఎం-6) రైల్వే శాఖ పలు కీలక లక్ష్యాలను అధిగమించింది. ముఖ్యంగా పరిశుభ్రత, స్క్రాప్ తొలగింపు, ఈ-వేస్ట్ నిర్వహణ, పెండింగ్ వ్యవహారాల పరిష్కారం, ప్రక్రియల సరళీకరణలో గణనీయమైన పురోగతి సాధించింది.

ప్రజా కేంద్రీకృత కార్యక్రమంలో భాగంగా ప్రయాణికులతో నేరుగా మాట్లాడేందుకు, పరిశుభ్రత, ప్రయాణికుల సదుపాయాలు, రైల్వే సేవలపై అభిప్రాయాలు, సూచనలు స్వీకరించేందుకు అక్టోబర్ 22, 2026న దేశవ్యాప్తంగా 5,884 రైల్వే స్టేషన్లలో రైల్ జన్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యూఢిల్లీ స్టేషన్‌లో రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈఓ శ్రీ సతీశ్ కుమార్ వాటాదారులతో మాట్లాడారు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్‌లో జరిగిన కార్యక్రమంలో డీఏఆర్‌పీజీ కార్యదర్శి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమస్యలను గుర్తించి, ప్రయాణికుల సేవలను మరింత మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం లభించింది.

అక్టోబర్ 31తో ప్రత్యేక ప్రచార కార్యక్రమం-6 ముగియనున్న నేపథ్యంలో ఈ ప్రచార కాలంలో సాధించిన విజయాలను సుస్థిరం చేయటంపై భారత రైల్వేలు దృష్టి సారిస్తున్నాయి. పరిశుభ్రత, వనరుల సమర్థవంతమైన నిర్వహణ, పెండింగ్ అంశాల సత్వర పరిష్కారం, ప్రయాణికులకు మెరుగైన సేవలందించటమే లక్ష్యంగా ఇలాంటి ఉత్తమ విధానాలను కొనసాగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

 

****


(రిలీజ్ ఐడి: 2330232) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil , Kannada