కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నూతన అమ్నెస్టీ స్కీమ్-2025ని డిసెంబర్ 31, 2026 వరకు పొడిగించిన ఈఎస్ఐసీ... పెండింగ్ కేసుల పరిష్కారానికి యజమానులు, బీమా పొందిన వ్యక్తులకు మరింత సమయం కేటాయింపు

వ్యాజ్యాలను తగ్గించేందుకు, స్వచ్ఛంద నిబంధనలను ప్రోత్సహించేందుకు ఈఎస్ఐసీ నిబద్ధతను తెలియజేస్తున్న మూడు నెలల పొడిగింపు

నాడు పోస్టు చేయడమైనది: 29 OCT 2026 9:21AM by PIB Hyderabad

వివిధ భాగస్వాముల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ).. 01.10.2025 నుంచి 30.09.2026 వరకు అమల్లో ఉన్న ‘నూతన అమ్నెస్టీ స్కీమ్-2025’ గడువును ప్రస్తుత నిబంధనలు, షరతులపై మరో మూడు నెలల వరకు 01.10.2026 నుంచి 31.12.2026 వరకు పొడిగించింది.

‘నూతన అమ్నెస్టీ స్కీమ్-2025’... కోర్టు కేసుల పెండింగ్‌ను తగ్గించేందుకు, గత ఈఎస్‌ఐ చట్టం ద్వారా నిబంధనలను పాటించటాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన సమయ వివాద పరిష్కార కార్యక్రమం. కోర్టు వెలుపల రాజీ కుదుర్చుకునేందుకు ఈఎస్ఐసీతో చట్టపరమైన వివాదాలను యజమానులు పరిష్కరించుకునేందుకు ఈ పథకం ఒక వ్యవస్థీకృత విధానాన్ని అందిస్తుంది. ఈ పథకం ద్వారా పలు అంశాలు వర్తిస్తాయి:

  • వాస్తవ చందాలు, వడ్డీని చెల్లించి తాత్కాలిక మదింపులను పరిష్కరించుకోవచ్చు. ఎలాంటి నష్టపరిహారాలు విధించరు.
  • ఇప్పటికే బకాయిలు చెల్లించిన యజమానులకు సంబంధించి, వివాదాస్పద నష్టపరిహారంలో 10 శాతం చెల్లించాలనే నిబంధనకు లోబడి కేసులను ఉపసంహరించుకుంటారు.
  • రికార్డులను సమర్పించనందుకు, చెల్లింపులు ఆలస్యం చేసినందుకు ఈఎస్ఐసీ ద్వారా దాఖలైన, ఆ తర్వాత నిబంధనలు పాటించిన కేసులను కూడా కోర్టు అనుమతితో ఉపసంహరించుకుంటారు.
  • 31.03.2025 వరకు దాఖలైన కోర్టు కేసులకు ఈ పథకం ద్వారా అర్హత లభిస్తుంది.

ఈ పథకం పొడిగింపు ద్వారా అర్హులైన యజమానులు, బీమా పొందిన వ్యక్తులు ప్రయోజనాలను పొందేందుకు అదనపు సమయం లభిస్తుంది. సంబంధిత భాగస్వాములందరూ 31.12.2026న గడువు ముగిసేలోపు పొడిగించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను [https://esic.gov.in/attachments/publicationfile/Amnesty_Flyer_2025_1762755260.pdf] లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.

వివాదాల పరిష్కారానికి ఆచరణాత్మకమైన, యజమానులకు అనుకూలమైన మార్గమే ‘నూతన అమ్నెస్టీ స్కీమ్-2025’. ఇది ఈఎస్‌ఐసీ సేవలందిస్తున్న పౌరుల హక్కులను కాపాడుతూనే, సులభతర వ్యాపారాలను పెంపొందించాలన్న ప్రభుత్వ విస్తృత లక్ష్యానికి తోడ్పడుతుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2329896) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Bengali , Tamil , Malayalam