జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

‘మహిళా ఖైదీలు, వారి పిల్లల మానవ హక్కుల పరిరక్షణ’ అంశంపై సలహాలను విడుదల చేసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఇండియా

మహిళా ఖైదీలు, వారి పిల్లల మానవ హక్కుల పరిరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని,
లైంగిక సమానత్వాన్ని దృష్టిలో పెట్టుకొని సున్నిత వైఖరి అవలంబించాలని స్పష్టీకరణ

సలహాలలో పొందుపరిచిన పది కీలక అంశాలలో
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కేంద్ర మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, పరిపాలకులు,
డీజీపీలు తీసుకొనే చర్యల ప్రస్తావన

ఎన్‌హెచ్‌ఆర్‌సీ సలహాలలో తాను చేసిన సిఫారసులపై చర్యలను కోరుతూ
సంబంధిత అధికారుల నుంచి రెండు నెలల లోపల
కార్యాచరణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని సూచన

నాడు పోస్టు చేయడమైనది: 28 OCT 2026 12:11PM by PIB Hyderabad

‘మహిళా ఖైదీలు, వారి పిల్లల మానవ హక్కుల పరిరక్షణ’ అంశంపై తొమ్మిది కేంద్ర మంత్రిత్వ శాఖలు, ప్రధాన కార్యదర్శులు/పరిపాలకులు, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల (యూటీస్) పోలీస్ డైరెక్టర్ జనరళ్లకు భారతదేశ జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్ఆర్‌సీ) ఒక అడ్వయిజరీని జారీ చేసింది.
మహిళా ఖైదీలు, వారి పిల్లలు సహా ఖైదీల హక్కులు, అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, లైంగిక సమానత్వాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పష్టం చేసింది. మహిళా ఖైదీలు, వారి పిల్లలు అత్యంత ప్రాధాన్య వర్గం కిందకు వస్తారని పేర్కొంది. కస్టడీకి సంబంధించిన భద్రత చర్యలకు తోడు జైలులో మానవీయ పరిస్థితులు, తల్లీబిడ్డల స్వాస్థ్య సంరక్షణపై అవసరమైన మేరకు శ్రద్ధ, న్యాయ లభ్యత, కుటుంబ సంబంధాల సంరక్షణ, పిల్లల ప్రయోజనాలను కాపాడటం, పునరావాసం, సామాజిక పునరేకీకరణకు అర్థవంతమైన అవకాశాలు కల్పించాలని పేర్కొంది.
ఈ అడ్వయిజరీలో పది విస్తృత రంగాలపై దృష్టి సారించారు. వాటిలో.. ప్రి-అడ్మిషన్, అరెస్టు, జైలులోకి ప్రవేశం కల్పించడం, ప్రవేశ రికార్డులు, బాలల సమాచార నిధి (డేటాబేస్), డాక్యుమెంటేషన్, ఆరోగ్యం, వైద్య సంరక్షణ, మానసిక స్వస్థత సేవలు, మహిళా ఖైదీలు: వారి స్థితిగతులు, స్వచ్ఛత, సంక్షేమం- చైతన్య ప్రబోధం, ఖైదీలతో పాటు ఉండే వారు గాని లేదా వారికి దూరంగా ఉండే బాలలు, కమ్యూనికేషన్, ములాకాత్, కుటుంబంతో సంప్రదింపు, జైలు పరిపాలన, న్యాయ సహాయం, న్యాయ లభ్యత, మహిళా ఖైదీలను న్యాయస్థానంలో ప్రవేశపెట్టే సమయంలో ప్రత్యేక సౌకర్యాల కల్పన, సంక్షేమ చర్యలు, పునరావాసం, విడుదల అనంతర కాలంలో సామాజిక పునరేకీకరణ, విదేశీ పౌరసత్వం కలిగిన ఖైదీలు వంటివి ఉన్నాయి. పూర్తి వివరాలను https://nhrc.nic.in/flipbook/other_advisories/46 లో పేర్కొన్నారు.
అడ్వయిజరీలో చేసిన సిఫారసులను సంబంధిత అధికారులు అమలుచేయాలని, రెండు నెలల లోపల చర్యల నివేదిక (ఏటీఆర్)ను దాఖలు చేయాలని, ఈ విషయంలో ప్రగతికి సంబంధించిన సమాచారాన్ని తన దృష్టికి తీసుకువస్తుండాలని ఎన్‌హెచ్ఆర్‌సీ కోరింది.

 

***


(రిలీజ్ ఐడి: 2329664) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Gujarati , English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Tamil , Malayalam