నాడు పోస్టు చేయడమైనది:
28 OCT 2026 11:04AM by PIB Hyderabad
అక్రమ వాణిజ్యంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) దాడులను కొనసాగిస్తోంది. 2026 అక్టోబర్ 24న కోల్‌కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టులో అక్రమంగా రవాణా చేస్తున్న 55,000కు పైగా ఈ–సిగరెట్లను స్వాధీనం చేసుకుంది.

నేపాల్‌కు తరలించనున్న ఈ–సిగరెట్లుగల రెండు కంటెయినర్ల సరకును నిర్దిష్ట సమాచారం ఆధారంగా డీఆర్ఐ అధికారులు అడ్డుకున్నారు. ఈ సరకు వివరాలను ఒక దానిలో వాటర్ గ్లాస్‌గా, మరోదానిలో సిరామిక్ మగ్స్‌గా పేర్కొన్నారు. మొదటి కంటెయినర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయగా ప్రకటించిన కార్గో మధ్య వివిధ ఫ్లేవర్లకు చెందిన ఐజెట్ బ్రాండుకు చెందిన ఈ–సిగరెట్లు బయటపడ్డాయి. రెండో కంటెయినర్‌ను పరిశీలించగా ప్రకటించిన సరకు మధ్య వీటీవీ, వీవోకేవో, బ్యాంగ్, ఈజాయ్ లాంటి వివిధ బ్రాండ్లకు చెందిన 15,000 ఈ–సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.
కస్టమ్స్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల ప్రకారం కవర్ కార్గోతో పాటు మొత్తంగా రూ. 13.50 కోట్ల విలువైన సుమారు 55,000 ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ప్రజారోగ్యం, ప్రమాదం నుంచి ప్రజలను కాపాడే దృష్ట్యా ఎలక్ట్రానిక్ సిగరెట్ల (ఉత్పత్తి, తయారీ, దిగుమతి, ఎగుమతి, విక్రయం, పంపిణీ, నిల్వ, ప్రకటన) నిషేధ చట్టం – 2019 ప్రకారం ఎలక్ట్రానిక్ సిగరెట్లు, అన్ని ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్ (ఈఎన్‌డీఎస్)ను భారతదేశంలో నిషేధించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026–27లో మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ పశ్చిమబెంగాల్లోని వివిధ ఓడరేవులు, విమానాశ్రయాలు, ఐసీడీల ద్వారా సుమారుగా 3,00,000 ఈ–సిగరెట్లను డీఆర్ఐ స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ. 120 కోట్లకు పైగా ఉంది.
***