నాడు పోస్టు చేయడమైనది:
26 OCT 2026 12:26PM by PIB Hyderabad
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
పెరుగుతున్న భారత క్రీడా సామర్థ్యం, మహిళల క్రికెట్ ఎదుగుదల, మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానంలో దేశం సాధించిన పురోగతి గురించి ఈ కథనంలో కెవిన్ పీటర్సన్ వివరించారు. వన్యప్రాణులను సంరక్షించడం, జాతీయ వారసత్వాన్ని పరిరక్షించడం లాంటి ప్రయత్నాలతో పాటుగా ప్రధానమంత్రి నాయకత్వం భారతదేశ దృక్పథాన్ని ఎలా మార్చిందో ఈ వ్యాసం వివరిస్తుంది.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘క్రీడలు, టెక్నాలజీ, వన్యప్రాణుల సంరక్షణలో భారత్ తనదైన ముద్ర వేస్తోంది!
పెరుగుతున్న భారతదేశ క్రీడా శక్తి, మహిళల క్రికెట్ ఎదుగుదల, మౌలిక వసతులు, సాంకేతిక రంగంలో దేశం సాధిస్తున్న పురోగతిపై కెవిన్ పీటర్సన్ @KP24 తన అభిప్రాయాలను పంచుకున్నారు. వన్యప్రాణులను సంరక్షించడం, జాతీయ వారసత్వాన్ని పరిరక్షించడం లాంటి ప్రయత్నాలతో పాటుగా పీఎం @narendramodi నాయకత్వం భారతదేశ దృక్పథాన్ని ఎలా మార్చిందో వివరించారు.’’
https://www.hindustantimes.com/opinion/an-aspiring-achieving-assertive-new-india-101792953158240.html