నాడు పోస్టు చేయడమైనది:
26 OCT 2026 11:49AM by PIB Hyderabad
బ్రెజిల్లో నిర్వహించిన అధ్యక్ష ఎన్నికలలో శ్రీ లూయిజ్ ఇనాసియో లూలా దా సిల్వా గెలవడంతో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఈ రోజు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
వివిధ రంగాల్లో భారత్-బ్రెజిల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడానికి శ్రీ లూలా దా సిల్వాతో కలసి పనిచేయాలని ఉత్సాహంగా ఉందని శ్రీ మోదీ అన్నారు. వేరువేరు రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసుకొనే దిశగా ఇరు దేశాలు ఇక మీదట కూడా కలసి ముందుకు సాగుతాయని, అభివృద్ధి చెందుతున్న దేశాల ఉమ్మడి ప్రాధాన్యాలను సాకారం చేయడానికి కృషి చేస్తాయని, మరిన్ని దేశాలను కలుపుకొని ముందుకు వెళ్లే, సమానావకాశాలు లభించే, సుస్థిర ప్రాతిపదికను కలిగి ఉండే ప్రపంచాన్ని ఆవిష్కరించే లక్ష్యంతో పనిచేస్తాయని శ్రీ మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘నా ప్రియ మిత్రుడు, అధ్యక్షుడు శ్రీ లూలా దా సిల్వా అసాధారణ రీతిలో తిరిగి ఎన్నిక అయిన సందర్భంగా ఆయనకు ఇవే హార్దిక అభినందనలు. బహుళ రంగాలలో భారత్-బ్రెజిల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఎక్కువగా విస్తరించడానికి ఆయనతో కలసి పనిచేయాలని నేను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను.
వేరువేరు రంగాలలో మన సహకారాన్ని పటిష్టపరుచుకోవడానికి మనం కలిసికట్టుగా ఇక ముందు కూడా మన పయనాన్ని కొనసాగించుదాం. అభివృద్ధి చెందుతున్న దేశాల ఉమ్మడి ప్రాధాన్యాలను సాకారం చేసేందుకు కృషి చేస్తూనే ఉందాం. మరిన్ని దేశాలను కలుపుకొని ముందుకు వెళ్లే, సమానావకాశాలు లభించే, సుస్థిర ప్రాతిపదికను కలిగి ఉండే ప్రపంచాన్ని ఆవిష్కరించే లక్ష్యంతో పనిచేద్దాం.
@LulaOficial’’.