ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారా గేమ్స్‌లో రజతం గెలిచిన భావనా చౌదరి, పూజా జాత్యాన్‌లకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 23 OCT 2026 6:58PM by PIB Hyderabad

ఆసియా పారా గేమ్స్‌ మహిళల రికర్వ్ డబుల్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించి, చరిత్రాత్మక రజత పతకాన్ని సాధించిన భావనా చౌదరి, పూజా జాత్యాన్‌లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.

వారి విజయం విలువిద్యలో ఆసక్తి గల ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

"ఆసియా పారా గేమ్స్‌లో భావనా చౌదరి, పూజా జాత్యాన్‌లకు చరిత్రాత్మక రజతం!

ఆసియా పారా గేమ్స్‌ మహిళల రికర్వ్ డబుల్స్‌ విభాగంలో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన ఈ ద్వయానికి అభినందనలు. వారి ఈ విజయం ఎంతో మంది వర్ధమాన ఆర్చర్లకు స్ఫూర్తినిస్తుంది: ప్రధానమంత్రి @narendramodi"


(రిలీజ్ ఐడి: 2327945) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam