నాడు పోస్టు చేయడమైనది:
23 OCT 2026 10:17PM by PIB Hyderabad
పారా ఆసియా క్రీడల మహిళల డబుల్స్ ఎస్‌ఎల్3-ఎస్‌యూ5 విభాగంలో చాంపియన్లుగా నిలిచి స్వర్ణ పతకం సాధించిన తులసిమతి మురుగేశన్, మానసి జోషిలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు.
వారిద్దరి అద్భుతమైన ప్రదర్శన దేశానికి గొప్ప గర్వకారణమని పేర్కొన్న శ్రీ నరేంద్ర మోదీ.. అంతర్జాతీయ వేదికలపై వారు ఇదే రీతిలో రాణించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:
"తులసిమతి మురుగేశన్, మానసి జోషిలు అద్భుత విజయంతో స్వర్ణ పతకాన్ని సాధించారు!
పారా ఆసియా క్రీడల మహిళల డబుల్స్ ఎస్‌ఎల్3-ఎస్‌యూ5 విభాగంలో చాంపియన్లుగా నిలిచిన ఈ జోడీకి హృదయపూర్వక అభినందనలు. వీరి అద్భుతమైన ప్రదర్శన దేశానికి ఎనలేని గర్వాన్ని తెచ్చిపెట్టింది. అంతర్జాతీయ వేదికలపై వారు ఇదే విధంగా రాణిస్తూ దేశ కీర్తిని నిలబెట్టాలని కోరుకుంటున్నాను: PM @narendramodi”