ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారాగేమ్స్‌లో రజత విజేత కపిల్‌ కుమార్‌కు ప్రధానమంత్రి ప్రశంసలు

నాడు పోస్టు చేయడమైనది: 22 OCT 2026 6:35PM by PIB Hyderabad

   ఆసియా పారా గేమ్స్‌-2026 పురుషుల 400 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్‌10 విభాగంలో అద్భుత సమయంతో రజత పతకం సాధించిన కపిల్ కుమార్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.

కపిల్ కుమార్ సహనశక్తి, అంకితభావం, దృఢ దీక్ష అతనికి ఈ విజయాన్ని ఆర్జించి పెట్టాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ అద్భుత ప్రదర్శనపై ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా పారా గేమ్స్‌ పురుషుల 400 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్‌10 విభాగంలో కపిల్ కుమార్ అద్భుత సమయంతో రజత పతకం సొంతం చేసుకున్నాడు. అతడి సహనశక్తి, అంకితభావం, దృఢ సంకల్పమే ఈ విజయం ఆర్జించిపెట్టాయి. అసాధారణ ప్రతిభను చాటుకున్న కపిల్‌కు హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్తులో ఆయన మరిన్ని మెరుగైన విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు వివరించింది.

***


(రిలీజ్ ఐడి: 2327393) సందర్శకుల సూచీ సంఖ్య : : 11