ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారా గేమ్స్‌ స్వర్ణ పతక విజేత శ్రీ శైలేశ్ కుమార్‌కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 22 OCT 2026 6:52PM by PIB Hyderabad

ఆసియా పారా గేమ్స్‌-2026.. పురుషుల హై జంప్ టీ42/టీ63 పోటీలో అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సాధించడంతో పాటు గేమ్స్‌లో కొత్త రికార్డును కూడా సృష్టించినందుకు శ్రీ శైలేశ్ కుమార్‌‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.

ఈ అసాధారణ విజయం ఆయన ప్రతిభనీ, నిలకడతనాన్నీ, అంకితభావాన్నీ చాటుతోందని శ్రీ మోదీ అన్నారు. భారత్ ఆయనను చూసి సంతోషపడుతోందని ప్రధానమంత్రి అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ ఇలా పేర్కొంది:

‘‘ఆసియా పారా గేమ్స్‌-2026.. పురుషుల హై జంప్ టీ42/టీ63 పోటీలో శ్రీ శైలేశ్ కుమార్‌ అద్భుత ప్రదర్శనను కనబరిచి, స్వర్ణ పతకాన్ని సాధించడంతో పాటు గేమ్స్‌‌లో ఒక కొత్త రికార్డును కూడా సృష్టించారు. ఈ అసాధారణ విజయం ఆయన ప్రతిభనీ, నిలకడనీ, అంకితభావాన్నీ చాటుతోంది. ఆయనను చూసి భారత్ సంతోషిస్తోంది: PM @narendramodi

***


(రిలీజ్ ఐడి: 2327251) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam