ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారా గేమ్స్‌లో రజత పతక విజేత కస్తూరి రాజమణికి అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 21 OCT 2026 7:06PM by PIB Hyderabad

ఆసియా పారా గేమ్స్‌-2026లో ఈ రోజు మహిళల 67 కేజీల పోటీలో రజత పతకాన్ని గెలిచిన కస్తూరి రాజమణిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ గెలుపుతో, ఈ కేటగిరీలో భారతదేశానికి మొదటి పతకాన్ని ఆమె సంపాదించి పెట్టారు.

ఇది భారతీయ పారా పవర్‌లిఫ్టింగ్ క్రీడకు చరిత్రాత్మక విజయమని శ్రీ మోదీ వర్ణించారు. కస్తూరి రాజమణి దృఢ సంకల్పాన్నీ, మెరుగైన ప్రదర్శననీ, అంకితభావాన్నీ చాటి, ఈ విజయాన్ని నిజానికి ప్రత్యేకంగా మార్చివేశారని ప్రధానమంత్రి అన్నారు. కస్తూరికి ప్రధానమంత్రి అభినందనలను తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ ఇలా పేర్కొంది:

‘‘భారతీయ పారా పవర్‌లిఫ్టింగ్ క్రీడకు చరిత్రాత్మక విజయం!

ఆసియా పారా గేమ్స్‌-2026 మహిళల 67 కేజీల పోటీలో కస్తూరి రాజమణి అద్భుతమైన లిఫ్ట్‌తో రజత పతకాన్ని గెలిచారు. ఈ కేటగిరీలో భారతదేశానికి మొదటి పతకాన్ని అందించారు. ఆమె దృఢ సంకల్పం, మెరుగైన ప్రదర్శననివ్వాలనే అంకితభావం ఈ గెలుపును నిజంగానే ఎంతో ప్రత్యేకంగా మార్చివేశాయి. కస్తూరికి అభినందనలు: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’.

***


(రిలీజ్ ఐడి: 2326595) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam