ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణంతో మెరిసిన దిలీప్‌ గవిట్‌కు ప్రధానమంత్రి ప్రశంసలు

నాడు పోస్టు చేయడమైనది: 21 OCT 2026 7:30PM by PIB Hyderabad

   ఆసియా పారా గేమ్స్‌-2026 పురుషుల 100 మీటర్ల పరుగు టి47 విభాగంలో అసాధారణ ప్రతిభ, అద్భుత సమయం నమోదుతో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న దిలీప్ గవిట్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అభినందనలు తెలిపారు.

చిరుతను తలపించే అతని వేగం, నైపుణ్యం దేశానికి ఎనలేని కీర్తిని ఆర్జించి పెట్టాయని పేర్కొంటూ, ఈ ఘన విజయంపై శ్రీ మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఈ విజయ పరంపరను అతడు కొనసాగించగలడని ఆశాభావం వ్యక్తం చేశారు.

దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా పారా గేమ్స్-2026లో దిలీప్ గవిట్‌ అద్భుత ప్రతిభ చూపాడు. పురుషుల 100 మీటర్ల T47 విభాగంలో అద్భుత టైమింగ్‌తో స్వర్ణం సాధించాడు. అతని ఉత్తేజపూరిత వేగం, నైపుణ్యం దేశానికి ఎనలేని కీర్తిప్రతిష్టలు సముపార్జించి పెట్టాయి. ఈ ఘన విజయంపై దిలీప్‌కు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులోనూ అతడు మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నాం.” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు వివరించింది.

***


(రిలీజ్ ఐడి: 2326585) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam