నాడు పోస్టు చేయడమైనది:
21 OCT 2026 7:13PM by PIB Hyderabad
ఆసియా పారా గేమ్స్-2026 మహిళల 100 మీటర్ల పరుగు టి35 విభాగంలో రజత పతకం సాధించిన ప్రీతి పాల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.
పాల్గొన్న రెండు రేసుల్లోనూ రెండు రజత పతకాలతో ఆమె తన చిరస్మరణీయ ప్రస్థానాన్ని ఘనంగా ముగించిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు 100, 200 మీటర్ల పరుగులో సాధించిన ఈ విజయాలు ఆమె అద్భుత ప్రగతికి, అసాధారణ వేగంతోపాటు అకుంఠిత దీక్షకు, దృఢ సంకల్పానికి నిదర్శనాలని కితాబిచ్చారు. నిరంతర కృషి, ఆత్మవిశ్వాసంతో సాధించలేనిది ఏదీ లేదని ఆమె నిరూపించారని, ఆమె విజయాలపై దేశం వేడుక చేసుకుంటున్నదని కొనియాడారు.
దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“రెండు రేసులు, రెండు రజత పతకాలు… అద్భుతం! ప్రీతిపాల్ తన చిరస్మరణీయ ఆసియా పారా గేమ్స్ ప్రస్థానాన్ని మరో అసాధారణ ప్రదర్శనతో ముగించింది. ఈసారి మహిళల 100మీ టీ35 విభాగంలో రజతం గెలుచుకుంది. మొత్తంమీద 100, 200 మీటర్ల పరుగు పందాలు రెండింటిలోనూ ప్రీతి సాధించిన విజయం, ఆమె విశిష్ట పురోగతిని, అసాధారణ వేగాన్ని, అచంచల సంకల్పాన్ని ప్రతిబింబించింది. ఆత్మవిశ్వాసంతోపాటు నిరంతర కృషితో ఏదైనా సాధించవచ్చునని ఆమె నిరూపించింది. ప్రీతి సాధించిన ఈ రెండు విజయాలపై యావద్దేశం వేడుక చేసుకుంటోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు వివరించింది.
***