నాడు పోస్టు చేయడమైనది:
21 OCT 2026 6:59PM by PIB Hyderabad
ఆసియా పారా గేమ్స్-2026.. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్12/ఎఫ్13 పోటీలో రజత పతకాన్ని గెలిచిన శ్రీ మన్‌జీత్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.
వెనుకటి ఆసియా పారా గేమ్స్‌లో నాలుగో స్థానంలో నిలవడం మొదలు ఈ సంవత్సరంలో రజత పతకాన్ని చేజిక్కించుకోవడం వరకు శ్రీ మన్జీత్ సాధించిన ప్రగతి ప్రయాణం అద్భుతమని శ్రీ మోదీ ప్రశంసించారు. శ్రీ మన్జీత్ గెలుపు ఆయన ఎంతగా కష్టపడిందీ, ఎంతగా ఆట కోసం తపించిందీ, అంకితభావాన్ని కనబరిచిందీ తెలియజేస్తోందని ప్రధానమంత్రి అన్నారు. రాబోయే కాలంలో కూడా భారతీయులు సంతోషించేటట్లు శ్రీ మన్జీత్ చూస్తారని తాను ఆశిస్తున్నానని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ ఇలా పేర్కొంది:
‘‘శ్రీ మన్జీత్ ప్రగతి ప్రస్థానం ఎంత అద్భుతమో కదా! వెనుకటి ఆసియా పారా గేమ్స్‌లో నాలుగో స్థానంలో నిలవడం మొదలు ఈ సంవత్సరంలో రజత పతకాన్ని చేజిక్కించుకోవడం వరకు చూస్తే.. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్12/ఎఫ్13 పోటీలో ఆయన గొప్పగా రాణించారు. ఆయనకు అభినందనలు. ఆయన సాధించిన ఈ విజయం కఠిన శ్రమనీ, తపననీ, అంకితభావాన్నీ చాలా చక్కగా చాటిచెబుతున్నది. రాబోయే కాలంలో కూడా భారతదేశ ప్రజలు సంతోషించేటట్లు ఆయన తన కృషిని కొనసాగిస్తారని నేను ఆశిస్తున్నాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’.
***