నాడు పోస్టు చేయడమైనది:
21 OCT 2026 6:42PM by PIB Hyderabad
ఆసియా పారా గేమ్స్-2026 పురుషుల 100 మీటర్ల పరుగు టీ37 విభాగంలో కాంస్యం సాధించిన రాకేష్‌భాయ్ భట్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.
ఇదొక అద్భుత పరుగు… అతని వేగం, ఏకాగ్రత, అంకితభావం విజేతల వేదికపై తగిన స్థానాన్ని సముపార్జించి పెట్టాయి. భట్ సాధించిన విజయం నాకు ఎనలేని సంతోషాన్నిచ్చింది. భవిష్యత్తులోనూ అతడు మరింత మెరుగైన విజయాలు సాధించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.
దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“రాకేష్‌భాయ్ భట్ పరుగు అద్భుతం! ఆసియా పారా గేమ్స్-2026 పురుషుల 100 మీటర్ల పరుగు టీ37 విభాగంలో వ్యక్తిగత ఉత్తమ సమయం నమోదుతో కాంస్యం కైవసం చేసుకున్న అతని ప్రతిభ నన్నెంతో ముగ్ధుడిని చేసింది. అతని వేగం, ఏకాగ్రత, అంకితభావమే విజేతల వేదికపై తగిన స్థానం సంపాదించి పెట్టాయి. భవిష్యత్తులో అతడు మరిన్ని మెరుగైన విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ నా శుభాకాంక్షలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు వివరించింది.
***