నాడు పోస్టు చేయడమైనది:
21 OCT 2026 6:46PM by PIB Hyderabad
ఆసియా పారా క్రీడల్లో పురుషుల షాట్‌పుట్ ఎఫ్46 విభాగంలో రజత పతకం సాధించిన మహమ్మద్ యాసిర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మహ్మద్ యాసిర్ ఈ సీజన్‌లో అత్యుత్తమ త్రో విసిరారు.
ఏళ్ల తరబడి చేసిన కృషినీ, కఠోర శ్రమనూ, నిరంతరం మెరుగవ్వాలనే సంకల్పాన్నీ గత ఆసియా క్రీడల నుంచి మహమ్మద్ యాసిర్ సాగిస్తున్న ప్రయాణం ప్రతిబింబిస్తోందన్నారు. ఆయన కనబరిచిన ప్రశంసనీయమైన ప్రదర్శనను శ్రీ మోదీ అభినందించారు.
భవిష్యత్ ప్రయత్నాలలో రాణించాలని శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘ఆసియా పారా క్రీడల్లో మహ్మద్ యాసిర్ గణనీయమైన పురోగతి సాధించారు. ఈ సీజన్లోనే అత్యుత్తమ త్రో విసిరి పురుషుల షాట్‌పుట్ ఎఫ్46 విభాగంలో రజతం సాధించారు. ఏళ్ల తరబడి చేసిన కృషినీ, కఠోర శ్రమనూ, నిరంతరం మెరుగవ్వాలనే సంకల్పాన్ని గత ఆసియా క్రీడల నుంచి ఆయన సాగిస్తున్న ప్రయాణం సూచిస్తోంది. ఈ అత్యుత్తమ ప్రదర్శన చేసిన మహ్మద్ యాసిర్‌కు అభినందనలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను: పీఎం నరేంద్ర మోదీ’’