నాడు పోస్టు చేయడమైనది:
20 OCT 2026 8:39AM by PIB Hyderabad
ఈ రోజు విజయదశమి. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
సంతోషం, విశ్వాసాల మంగళప్రద పండుగ విజయదశమి. ఈ పర్వదినం అందరి సంకల్పాలకీ కొత్త శక్తిని అందించాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ప్రతి ఒ్కరి జీవితం హర్షంతో, సౌభాగ్యంతో, విజయంతో పరిపూర్ణం కావాలని శ్రీ మోదీ అభిలషించారు
.సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘విజయదశమి సందర్భంగా మీకందరికీ అనంత శుభకామనలు. ఉల్లాసం, విశ్వాసాలకు ప్రతీక అయిన ఈ విజయ పర్వం ప్రతి ఒక్కరి సంకల్పానికీ కొత్త శక్తిని అందించాలనీ, అందరి జీవితాల్లో సుఖ, సౌభాగ్యాలతో పాటు సఫలత కూడా సిద్ధించాలనీ కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
***