ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన దీప్తి జీవంజికి ప్రధానమంత్రి అభినందన

నాడు పోస్టు చేయడమైనది: 20 OCT 2026 6:48PM by PIB Hyderabad

ఆసియా పారా క్రీడల్లో మహిళల 400 మీటర్ల టీ20 విభాగంలో మరోసారి స్వర్ణ పతకం సాధించిన దీప్తి జీవంజిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  అభినందించారు.

తన ప్రదర్శనను మరింత మెరుగుపరుచుకుంటూ, క్రీడల రికార్డును నెలకొల్పి టైటిల్‌ను నిలబెట్టుకోవడం అసాధారణ విజయమని ప్రధాని పేర్కొన్నారు. నిజమైన ఛాంపియన్‌ స్ఫూర్తిని దీప్తి చాటిచెప్పారని, ఆమె విజయం ఎందరో యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. దీప్తి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

“అత్యుత్తమ ప్రతిభకు కొత్త నిర్వచనం ఇస్తున్న ఛాంపియన్‌! ఆసియా పారా క్రీడల్లో మహిళల 400 మీటర్ల టీ20 విభాగంలో దీప్తి జీవంజి మరోసారి స్వర్ణ పతకం సాధించి, క్రీడల రికార్డుతో తన టైటిల్‌ను నిలబెట్టుకున్నారు. తన ప్రదర్శనను మరింత మెరుగుపరుచుకుంటూ టైటిల్‌ను కాపాడుకోవడం నిజంగా అసాధారణమైన ఘనత. దీప్తి నిజమైన ఛాంపియన్‌ స్ఫూర్తిని చాటిచెప్పారు. ఆమె విజయం ఎందరో యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది. దీప్తికి నా శుభాకాంక్షలు” అని ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది. 

 

***


(రిలీజ్ ఐడి: 2325873) సందర్శకుల సూచీ సంఖ్య : : 14