నాడు పోస్టు చేయడమైనది:
20 OCT 2026 7:44PM by PIB Hyderabad
ఆసియా పారా క్రీడల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 విభాగంలో కాంస్య పతకం సాధించిన శ్రిష్టి అరోరాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
తొలిసారిగా ఆసియా పారా క్రీడల్లో పాల్గొన్న ఆమెకు ఈ పతకం అద్భుతమైన ఆరంభమని ప్రధాని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఆమె దేశానికి గర్వకారణంగా నిలుస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
“తొలిసారిగా ఆసియా పారా క్రీడల్లో పాల్గొన్న శ్రిష్టి అరోరా, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 విభాగంలో కాంస్య పతకం సాధించారు. ఈ పతకం ఆమెకు అద్భుతమైన ఆరంభం. భవిష్యత్తులోనూ శ్రిష్టి దేశానికి గర్వకారణంగా నిలుస్తారని నాకు విశ్వాసం ఉంది. ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్టు ఆయన కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది.