ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా పారా క్రీడల్లో రజతం సాధించిన రామ్ రతన్ సింగ్‌కు ప్రధాని అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
20 OCT 2026 9:25PM by PIB Hyderabad
ఆసియా పారా క్రీడలు-2026లో పురుషుల డిస్కస్ త్రో ఎఫ్51/52/53లో ప్రశంసనీయమైన రీతిలో త్రో విసిరి రజతం సాధించిన రామ్ రతన్ సింగ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.
భారతదేశం సంబరాలు చేసుకొనేలా పారా అథ్లెటిక్స్‌లో మరో పతకం దక్కిందని శ్రీ మోదీ అన్నారు. రామ్ రతన్ చేసిన కృషి, కనబరిచిన పట్టుదల పట్ల శ్రీ మోదీ గర్వం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం పోస్టు:
‘‘భారత్ సంబరాలు చేసుకొనేలా పారా అథ్లెటిక్స్‌లో మరో విజయం దక్కింది!
ఆసియా పారా క్రీడలు-2026లో పురుషుల డిస్కస్ త్రో ఎఫ్51/52/53 విభాగంలో ప్రశంసనీయమైన రీతిలో త్రో విసిరి రామ్ రతన్ సింగ్ రజతం సాధించారు. రామ్ రతన్ చేసిన కృషి, కనబరిచిన పట్టుదలకు గర్వపడుతున్నా: పీఎం నరేంద్రమోదీ’’
***
(రిలీజ్ ఐడి: 2325816)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2