నాడు పోస్టు చేయడమైనది:
20 OCT 2026 7:33PM by PIB Hyderabad
ఆసియా పారా క్రీడలు 2026లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 విభాగంలో అద్భుతమైన ప్రదర్శనతో రజత పతకం సాధించిన మనీష్ నర్వాల్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఏకాగ్రత, అంకితభావంతో మనీష్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారని ప్రధాని పేర్కొన్నారు. భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయత్నాల్లోనూ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.
‘‘ఆసియా పారా క్రీడలు 2026లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 విభాగంలో మనీష్ నర్వాల్ అద్భుతమైన స్కోరుతో రజత పతకాన్ని సాధించారు. ఆయన ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఏకాగ్రత, అంకితభావంతో మనీష్ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నారు. ఆయనకు అభినందనలు, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు’’ అని ప్రధాని పేర్కొన్నారు.