జాతీయ మానవ హక్కుల కమిషన్
33వ వ్యవస్థాపక దినోత్సవానికి ముందు మైగవ్ సహకారంతో నిర్వహించిన ఆన్‌లైన్ మానవ హక్కుల క్విజ్ - 2026లో 10 మంది విజేతలను ప్రకటించిన జాతీయ మానవ హక్కుల కమిషన్
మానవ హక్కులు, మానవ హక్కుల పరిరక్షణ చట్టం, జాతీయ మానవ హక్కుల కమిషన్ విధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా క్విజ్ పోటీ
క్విజ్ లో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి భాగస్వామ్యం; క్విజ్‌కు 1,67,127 వీక్షణలు - 26,459 మంది నుంచి సమాధానాలు
సమాధానాలు పంపినవారిలో అత్యధికులు 18 - 24 ఏళ్ల వయసు విభాగానికి చెందిన వారే
రాష్ట్రాల వారీగా పాల్గొన్న వారి సంఖ్యలో అగ్రస్థానంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు
నాడు పోస్టు చేయడమైనది:
19 OCT 2026 12:02PM by PIB Hyderabad
జాతీయ మానవ హక్కుల కమిషన్ తన ఆన్‌లైన్ క్విజ్ ‘మానవ హక్కుల క్విజ్–2026: జీవితం, స్వేచ్ఛ, సమానత్వం, గౌరవానికి ప్రాధాన్యం’లో విజేతలుగా నిలిచిన 10 మందిని ప్రకటించింది. కమిషన్ 33వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని మైగవ్ సహకారంతో సెప్టెంబరు 1 నుంచి అక్టోబరు 10, 2026 వరకు ఈ క్విజ్‌ను నిర్వహించింది. మానవ హక్కులు, మానవ హక్కుల పరిరక్షణ చట్టం - 1993, దేశవ్యాప్తంగా మానవ హక్కుల ప్రోత్సాహం, పరిరక్షణలో జాతీయ మానవ హక్కుల కమిషన్ విధులు, అధికారాలు, బాధ్యతలపై అందరికీ అవగాహన కల్పించడం ఈ క్విజ్ ప్రధాన ఉద్దేశం.
మొదటి బహుమతి రూ.15,000 ఆర్తి మహాజన్ గెలుచుకున్నారు. రెండో బహుమతి రూ.10,000 రితికకు, మూడో బహుమతి రూ.5,000 తూబా బెనజీర్‌కు లభించాయి. రూ.2,000 చొప్పున అందించే ఏడు ప్రోత్సాహక బహుమతులను ఆదిత్య గుప్తా, తరుణ్, రాణి మండల్, బసంత్ కుమార్ మహతో, లిఖిత్ కుమార్ ఏ, దీపిక మాదాసు గెలుచుకున్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఈ క్విజ్‌కు విశేష స్పందన లభించింది. మొత్తం 1,67,127 వీక్షణలు నమోదవగా, 26,459 నుంచి సమాధానాలు అందాయి. వీటిలో అత్యధిక సమాధానాలు 18 -24 ఏళ్ల వయసు విభాగానికి చెందిన వారి నుంచి వచ్చాయి. రాష్ట్రాల వారీగా పాల్గొన్న వారి సంఖ్యలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు అగ్రస్థానాల్లో నిలిచాయి.
పాల్గొన్నవారిలో 5,753 మంది 15కు 15 మార్కులు సాధించారు. క్విజ్ నిబంధనలు, షరతుల ప్రకారం మైగవ్ బృందం లాటరీ పద్ధతిలో 10 మంది విజేతలను ఎంపిక చేసింది. గరిష్ఠంగా 300 సెకన్లలో 15 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేలా ఈ క్విజ్ ను రూపొందించారు.
(రిలీజ్ ఐడి: 2325254)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6