ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహాగౌరి అమ్మవారిని పూజించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 19 OCT 2026 8:43AM by PIB Hyderabad

త్యాగం, తపస్సులకు ప్రతీక దేవీమాత మహాగౌరికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పూజ చేశారు. అమ్మవారి ఆశీస్సులతో దేశంలో అందరి భవిత ఉజ్జ్వలమవ్వాలని, ప్రతి ఒక్కరు యశస్సును, కీర్తిని అందుకోవాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘త్యాగం, తపస్సులకు ప్రతీక మహాగౌరి మాత. ఆ అమ్మవారి ఆశీస్సులతో అందరి భవిష్యత్తు ఉజ్జ్వలంగా వెలుగులీనాలి. ప్రతి ఒక్కరి జీవితంలో యశస్సు, కీర్తి కలగాలి అని నేను అభిలషిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2325151) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam