ప్రధాన మంత్రి కార్యాలయం
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవి స్కందమాతను పూజించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
15 OCT 2026 10:02AM by PIB Hyderabad
తల్లి ప్రేమ, వాత్సల్యాల ప్రతీక స్కందమాత అమ్మవారిని నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అర్చించారు.
దేవి మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ప్రేమ, సద్భావనల వాతావరణం వెల్లివిరియాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘నవరాత్రి ఉత్సవాల్లో అయిదో రోజు స్కందమాత అమ్మవారి ఆరాధనకు అంకితమైన రోజు. మమత, వాత్సల్యాల ప్రతీక దేవీ మాత. అమ్మవారి ఆశీర్వాదాలతో ప్రతి కుటుంబంలో ఎల్లవేళలా స్నేహ, సౌహార్దాలు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2323720)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6