మంత్రిమండలి
azadi ka amrit mahotsav

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్‌ను (పీఎల్‌‍బీ) ఆమోదించిన కేంద్ర కేబినెట్

నాడు పోస్టు చేయడమైనది: 14 OCT 2026 4:03PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్.. రైల్వే సిబ్బంది కనబరిచిన అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా 11,40,770 మంది రైల్వే ఉద్యోగులకు రూ. 2009.61 కోట్ల మొత్తంతో 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్ (పీఎల్‌‍బీ) చెల్లింపుకు ఆమోదం తెలిపింది.

అర్హులైన రైల్వే ఉద్యోగులకు ప్రతి సంవత్సరం దుర్గాపూజ లేదా దసరా సెలవులకు ముందు ఈ పీఎల్‌బీని చెల్లిస్తారు. ఈ సంవత్సరం కూడా దాదాపు 11.40 లక్షల మంది నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన పీఎల్‌బీ మొత్తాన్ని చెల్లిస్తున్నారు. రైల్వే వ్యవస్థ పనితీరును మరింత మెరుగుపరిచే దిశగా మెరుగ్గా పనిచేసేందుకు ఉద్యోగులకు ఒక ప్రోత్సాహకంగా ఈ బోనస్ చెల్లింపు ఉపయోగపడుతుంది.

అర్హత కలిగిన ప్రతి రైల్వే ఉద్యోగికి 78 రోజులకు గరిష్ఠంగా రూ. 17951 అందుతుంది. ట్రాక్ మెయింటెనెర్లు, లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లు (గార్డులు), స్టేషన్ మాస్టర్లు, సూపర్‌వైజర్లు, టెక్నీషియన్లు, టెక్నీషియన్ హెల్పర్లు, పాయింట్స్‌మన్, మినిస్టీరియల్ సిబ్బంది, ఇతర గ్రూప్ 'సీ' విభాగాలకు చెందిన వివిధ విభాగాల రైల్వే సిబ్బందికి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. 

2025-26 సంవత్సరంలో రైల్వేల పనితీరు అత్యంత ప్రశంసనీయంగా నమోదు కావడం గమనార్హం. భారతీయ రైల్వేలు రికార్డు స్థాయిలో 1670 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయటమే కాకుండా దాదాపు 7.41 బిలియన్ల (741 కోట్లు) ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2323293) సందర్శకుల సూచీ సంఖ్య : : 44