ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సంక్షేమం నుంచి సాధికారత దిశగా పాలన మార్పుపై కథనాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 14 OCT 2026 11:23AM by PIB Hyderabad

కేంద్రమంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

భారతదేశ పాలనలో సంక్షేమం నుంచి సాధికారత దిశగా జరుగుతున్న మార్పును ఈ కథనం స్పష్టం చేస్తుంది. అభివృద్ధి ప్రక్రియలో పౌరులను క్రియాశీలక భాగస్వాములుగా మారుస్తుంది. పారిశుద్ధ్యం, గ్యాస్ కనెక్షన్లు, వైద్య సేవలు, రుణాలు పొందే సౌకర్యం వంటి పథకాలు... ప్రతి లబ్దిదారుడికి ప్రయోజనాలను అందించటంపై, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు అవకాశాలను కల్పించటంపై దృష్టి సారిస్తాయి. 2047 నాటికి వికసిత్ భారత్, స్వశక్త భారత్ సాధించాలనే దార్శనికతకు ఈ పాలనా విధానం కీలకమైనది.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.

"భారతదేశ పాలనా విధానం సంక్షేమం నుంచి సాధికారత దిశగా మారటాన్ని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ కథనం ద్వారా వివరించారు. ఇది అభివృద్ధి ప్రక్రియలో పౌరులను క్రియాశీలక భాగస్వాములుగా మారుస్తుంది.

పారిశుద్ధ్యం, గ్యాస్ కనెక్షన్లు, ఆరోగ్య సంరక్షణ, రుణాలు పొందే సౌకర్యం వంటి పథకాలు... ప్రతి లబ్దిదారుడికి ప్రయోజనాలను అందించటంపై, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు అవకాశాలను కల్పించటంపై దృష్టి సారిస్తాయి. 2047 నాటికి వికసిత్ భారత్, స్వశక్త భారత్ సాధించాలనే దార్శనికతకు ఈ పాలనా విధానం కీలకం".

 

(రిలీజ్ ఐడి: 2323180) సందర్శకుల సూచీ సంఖ్య : : 14