ప్రధాన మంత్రి కార్యాలయం
జగన్మాత దివ్యశక్తిని, అనుగ్రహాన్ని వివరించే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
13 OCT 2026 9:19AM by PIB Hyderabad
జగన్మాత దివ్యశక్తిని, అనంతమైన పరాక్రమాన్ని కీర్తిస్తూ ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఆమెను ఈ విశ్వానికి మూలంగా ఈ శ్లోకం వర్ణిస్తుంది. అలాగే ఆమె ప్రసన్నమైనప్పుడు భూమిపై ఉన్న సకల జీవరాశికీ మోక్షదాయినిగా మారుతుందని తెలియజేస్తుంది.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
‘‘త్వం వైష్ణవి శక్తిరనన్తవీర్యా విశ్వస్య బీజం పరమాసి మాయా।
సమ్మోహితం దేవి సమస్తమేతత్ త్వం వై ప్రసన్నా భువి ముక్తిహేతుః।।’’
(రిలీజ్ ఐడి: 2322669)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7