ప్రధాన మంత్రి కార్యాలయం
నవరాత్రుల మొదటి రోజున మాతా శైలపుత్రిని ప్రార్థించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
11 OCT 2026 9:47AM by PIB Hyderabad
నవరాత్రుల ప్రారంభ సందర్భంగా… తొలి రోజైన ఈ రోజు శాంతి దేవత అయిన మాతా శైలపుత్రిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.
ఆ తల్లి దివ్య కృప ప్రతి ఒక్కరి హృదయంలో సహనం, ఆత్మవిశ్వాసం అనే జ్యోతిని వెలిగించాలని... దేశ ప్రజలందరిపైనా సదా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా అమ్మవారి భక్తి గీతాన్ని శ్రీ మోదీ పంచుకున్నారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘నవరాత్రుల ప్రారంభం సందర్భంగా, శాంతి దేవత అయిన శైలపుత్రి మాతకు నేను నమస్కరిస్తున్నాను. ఆమె దివ్య కృప ప్రతి ఒక్కరి హృదయంలో సహనం, ఆత్మవిశ్వాసం అనే జ్యోతిని వెలిగించుగాక. మన దేశ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండుగాక, ఇదే నా కోరిక’’.
(రిలీజ్ ఐడి: 2321953)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam