యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
అహ్మదాబాద్ లో బ్రిక్స్ సంప్రదాయ, స్వదేశీ క్రీడల ప్రదర్శన-2026 ప్రారంభంపై ప్రకటన చేసిన కేంద్రమంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ
అక్టోబర్ 12న అహ్మదాబాద్‌లో బ్రిక్స్ సంప్రదాయ, స్వదేశీ క్రీడల ప్రదర్శన-2026 నిర్వహణ
అహ్మదాబాద్ క్రీడల్లో బ్రిక్స్ దేశాల సంప్రదాయ, స్వదేశీ క్రీడలు, సాంస్కృతిక వారసత్వ ప్రదర్శన
నాడు పోస్టు చేయడమైనది:
10 OCT 2026 11:27AM by PIB Hyderabad
బ్రిక్స్ భారత అధ్యక్షతన అక్టోబర్ 12, 2026న అహ్మదాబాద్‌లోని వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బ్రిక్స్ సంప్రదాయ, స్వదేశీ క్రీడల ప్రదర్శన-2026 జరుగుతుంది. గుజరాత్ ప్రభుత్వంతో కలిసి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వశాఖ దీన్ని నిర్వహిస్తుంది.
ఈ కార్యక్రమాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ హర్ష్ సంఘ్వీ, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ సహాయమంత్రి శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే, గుజరాత్ క్రీడా శాఖ సహాయమంత్రి డాక్టర్ జైరామ్ గామిత్ ముఖ్య అతిథులుగా హాజరవుతారు.
ఈ క్రీడలు బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులను ఒకచోట చేర్చి, సంప్రదాయ, స్వదేశీ క్రీడా విధానాలను ప్రదర్శిస్తాయి. క్రీడల ద్వారా సాంస్కృతిక మార్పిడి, వారసత్వ పరిరక్షణ ప్రజల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందిస్తాయి.
పోటీతత్వం లేని వేదికగా రూపుదిద్దుకున్న ఈ క్రీడలు... సాంస్కృతిక ప్రాముఖ్యత, క్రీడాకారుల మధ్య పరస్పర సంబంధాలు, జ్ఞానాన్ని పంచుకునేందుకు ప్రాధాన్యతనిస్తాయి. సంప్రదాయ క్రీడా పద్ధతుల ప్రదర్శన, డాక్యుమెంటేషన్, అనుభవాల మార్పిడిపై దృష్టి సారిస్తాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొనే దేశాలు వైవిధ్యమైన సంప్రదాయ, స్వదేశీ క్రీడలను, సాంస్కృతిక ఆచారాలను ప్రదర్శిస్తాయి:
బెలారస్: గోరోడ్కి బొలీవియా: లుచా డి చోలిటాస్, టింకు, రాయులా, ట్రోంపో, కాచినస్, కరెరా డి సాకోస్
బ్రెజిల్: జరాబటానా (స్వదేశీ బ్లోపైప్), కొరిడా డి టోరాస్ (లాగ్ రేస్), బ్రెజిలియన్ పారా-జియు-జిట్సు, కపోయిరా చైనా: వుషు, లయన్ డ్యాన్స్, హెల్త్ కిగాంగ్
ఇథియోపియా: ఇథియోపియన్ రెజ్లింగ్ (టెగెల్), ఇథియోపియన్ జెనా (ఫీల్డ్ హాకీ), సెలస్ గెబెటా/18-12/బుబే/షాహే
భారతదేశం: మల్లఖాంబ్, యోగాసనం, కలరిపయట్టు ఇరాన్: జోర్ఖానా, హఫ్త్ సాంగ్, ఘనీహ్ కజకిస్థాన్: అసిక్ అటూ, టోగిజ్కుమలక్, కజాక్ కురేసి రష్యా: గోరోడ్కి, సాంబో దక్షిణాఫ్రికా: కగాటి, ఇంటోంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: అల్ తబ్బా
బిక్స్ దేశాల మధ్య క్రీడా రంగంలో సహకారాన్ని పెంపొందించుకునేందుకు, సంప్రదాయ, స్వదేశీ క్రీడలను ప్రోత్సహించేందుకు విదేశీ ప్రతినిధి బృందాలతో ద్వైపాక్షిక సమావేశాలు జరుగుతాయి.
ఈ క్రీడల్లో పాల్గొనే దేశాల గొప్ప క్రీడా వారసత్వాన్ని వేడుకగా నిర్వహించటమే కాక, బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర అవగాహనను, సాంస్కృతిక మార్పిడిని, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలపరిచే వేదికగా ఇది నిలుస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2321720)
సందర్శకుల సూచీ సంఖ్య : : 21