సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా పరిశుభ్రతను పెంపొందించడానికి, పెండింగ్‌లో ఉన్న దస్త్రాలను తగ్గించడానికి 'ప్రత్యేక క్యాంపెయిన్ 6.0'ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
09 OCT 2026 5:29PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఉన్న తన 610 కార్యాలయాల భాగస్వామ్యంతో 2026 అక్టోబర్ 2 నుంచి 'ప్రత్యేక క్యాంపెయిన్ 6.0' కార్యక్రమాన్ని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ప్రభుత్వ కార్యాలయాలలో పరిశుభ్రతను పెంపొందించడం, పెండింగ్‌లో ఉన్న దస్త్రాలను తగ్గించాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ-వ్యర్థాల సేకరణ, వేరుచేయటం, సక్రమ పద్ధతిలో నిర్వహణపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు.
సన్నాహక దశలో లక్ష్యాలను ఖరారు చేయడం, పెండింగ్‌లో ఉన్న సిఫార్సులు లేదా దస్త్రాలను గుర్తించడం, స్థలాన్ని సద్వినియోగం చేసుకోవడంపై ప్రణాళికలు రూపొందించాలని ప్రధాన కార్యాలయంతో పాటు క్షేత్రస్థాయి విభాగాలు, అన్ని మీడియా యూనిట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
సన్నాహక దశలో కేంద్ర సమాచార ప్రసార శాఖ, రైల్వే శాఖ, ఎలక్ట్రానిక్స్- ఐటీ శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్.. మంత్రిత్వ శాఖ, మీడియా యూనిట్ల సీనియర్ అధికారులతో సమావేశమై చర్చించారు. మంత్రిత్వ శాఖలోని అత్యంత కింది స్థాయి కార్యాలయం వరకు ప్రతి కార్యాలయాన్ని ఈ క్యాంపెయిన్‌లో భాగం చేయాలని ఆయన కోరారు. 2026 అక్టోబర్ 31 తర్వాత కూడా ఈ క్యాంపెయిన్ నిలిచిపోకుండా ఏడాది పొడవునా సాగే నిరంతర కార్యక్రమంగా కొనసాగాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండే కార్యాలయాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, చేసిన మంచి పనులను వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని ఆయన ఆదేశించారు.
సమాచార ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్, అన్ని మీడియా యూనిట్ల అధిపతులు, వారి నోడల్ అధికారులతో కలిసి ఈ సన్నద్ధతను, అమలును సమీక్షించారు. ఈ ఏడాది కార్యక్రమం కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి తగిన, సకాలంలో చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
గతంలో నిర్వహించిన ప్రత్యేక క్యాంపెయిన్‌లలో ఈ మంత్రిత్వ శాఖ అద్భుతమైన ప్రగతి సాధించింది. 'స్వచ్ఛత'ను వ్యవస్థీకృతం చేయడంలో, పెండింగ్ అంశాలను సకాలంలో పరిష్కరించడంలో తన నిరంతర నిబద్ధతను చాటుకుంది. గత క్యాంపెయిన్‌ల సమయంలో చేసిన ప్రయత్నాలు.. కార్యాలయాల పరిశుభ్రతను మెరుగుపరచడమే కాకుండా ఆదాయాన్ని ఆర్జించడం, స్థల నిర్వహణ, భౌతికంగా ఉండే దస్త్రాల తొలగింపులో గణనీయమైన ఫలితాలను సాధించాయి.
2021లో ప్రత్యేక క్యాంపెయిన్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ మంత్రిత్వ శాఖ మొత్తం రూ. 36.20 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ కాలంలో సుమారు 13.89 లక్షల కిలోగ్రాముల చెత్తాచెదారం లేదా పాత సామాగ్రిని తొలగించారు. 13.98 లక్షల చదరపు అడుగుల స్థలం ఖాళీ అయింది. 2.71 లక్షల భౌతిక దస్త్రాలను ఆమోదంతో తొలగించారు. మొత్తం 6,642 బహిరంగ కార్యక్రమాలను నిర్వహించారు. 15,496 ప్రాంతాలు శుభ్రం అయ్యాయి. ఈ విజయాలు, వాటి సంవత్సరాల వారీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
సంవత్సరాల వారీగా మొత్తం ఆదాయం, ప్రత్యేక క్యాంపెయిన్ కింద ఖాళీ అయిన స్థలం
సంవత్సరం
మొత్తం రాబడి (రూ. లో)
ఖాళీ అయిన మొత్తం స్థలం (చదరపు అడుగులలో)
2021
7433500
-
2022
254282632
1138993
2023
53899811
63216
2024
18366429
88108
2025
28037333
108523
ప్రత్యేక క్యాంపెయిన్ కింద సంవత్సరాల వారీగా పారవేసిన మొత్తం వ్యర్థాలు, తొలగించిన భౌతిక దస్త్రాలు
సంవత్సరం
పారవేసిన మొత్తం వ్యర్థాలు (కిలోగ్రాములలో)
మొత్తం తొలగించిన భౌతిక దస్త్రాలు
2021
-
-
2022
473545
73318
2023
349126
47094
2024
203765
48638
2025
363412
102768
సంవత్సరాల వారీగా మొత్తం బహిరంగ కార్యక్రమాలు, ప్రత్యేక క్యాంపెయిన్ కింద శుభ్రం చేసిన ప్రదేశాలు
సంవత్సరం
మొత్తం బహిరంగ కార్యక్రమాలు
శుభ్రం అయిన మొత్తం ప్రదేశాలు
2021
-
-
2022
1103
3947
2023
2358
4394
2024
1487
4264
2025
1694
2891
***
(రిలీజ్ ఐడి: 2321553)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2