ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీమతి రూపీ సొరేన్ మృతికి ప్రధాని సంతాపం

నాడు పోస్టు చేయడమైనది: 08 OCT 2026 12:26PM by PIB Hyderabad

శ్రీమతి రూపీ సొరేన్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

గిరిజన సమాజాలను సాధికారం చేసేందుకు ఆమె ఎల్లప్పుడూ కృషి చేశారని ప్రధానమంత్రి అన్నారు. ఈ విషాద సమయంలో హేమంత్ గారు, కల్పన గారు, వారి కుటుంబ సభ్యులకు శ్రీ మోదీ సానుభూతి తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

‘‘రూపీ సొరేన్ మరణం దిగ్భ్రాంతి కలిగించింది. గిరిజన సమాజాల సాధికారత కోసం ఆమె విశేష కృషి చేశారు. ఈ విషాద సమయంలో హేమంత్ గారు, కల్పన గారు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను.’’


(రిలీజ్ ఐడి: 2320704) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam