ప్రధాన మంత్రి కార్యాలయం
స్వరాజ్య సాధనకు అంకితమైన వారు.. అసలైన వీరులు అంటున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
08 OCT 2026 8:17AM by PIB Hyderabad
దేశానికి సేవ చేయడానికి వ్యక్తిగత సుఖాలను త్యాగం చేసే వారిదే నిస్వార్థమూ, అంకిత భావమూ అని చెబుతున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘భస్మీకృతస్వార్థసౌఖ్యపరిచర్చితవిగ్రహాః
స్వరాజ్యయోగనిర్మగ్నా ధన్యాస్తే వీరయోగినః’’ అని పేర్కొన్నారు.
‘స్వీయ సుఖాలను త్యాగం చేసి, సంపూర్ణ అస్తిత్వాన్ని స్వరాజ్య సాధనకే అంకితం చేసిన వారే నిజమైన వీరులు’’ అని ఈ సుభాషితం మనకు బోధిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2320699)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2