నాడు పోస్టు చేయడమైనది:
07 OCT 2026 1:01PM by PIB Hyderabad
25 ఏళ్ల ప్రధాని పాలనా ప్రస్థానంలో భారతదేశ అభివృద్ధి వేగం ఎలా పెరిగిందీ వివరిస్తూ కేంద్ర మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ రాసిన ఓ వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పంచుకున్నారు.
ఈ సమయం... డిజిటల్ టెక్నాలజీ, మౌలిక వసతుల నుంచి తయారీ, సామాజిక సంక్షేమం వరకు భారతదేశ తదుపరి వృద్ధి దశకు, వికసిత్ భారత్–2047 దార్శనికతకు బలమైన పునాదులు వేసిన విధానాన్ని శ్రీ ఖట్టర్ వివరించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని కార్యాలయం పోస్టు:
‘‘ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల పరిపాలనా కాలంలో భారతదేశ అభివృద్ధి వేగం అనేక రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ రాశారు.
ఈ కాలం.. డిజిటల్ టెక్నాలజీ, మౌలిక సదుపాయాల నుంచి తయారీ రంగం, సామాజిక సంక్షేమం వరకు భారతదేశ తదుపరి వృద్ధి దశకు, వికసిత్ భారత్ – 2047 వరకు అవసరమైన బలమైన పునాదులను వేసింది.’’