ప్రధాన మంత్రి కార్యాలయం
అక్టోబరు 8న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసి) 10వ మహాసభకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం
“అవధుల్లేని విస్తరణ” ఇతివృత్తంగా ‘ఐఎంసీ-2026’ నిర్వహణ
ఈ మహాసభకు నాలుగు కీలక స్తంభాలుగా సృష్టి: భవిష్యత్తుకు రూపకల్పన.. సంవర్ధన్: వృద్ధికి నవ్యోత్తేజం… సశక్త్: అవకాశాల విస్తరణ.. సురక్ష: విశ్వసనీయత బలోపేతం
స్మార్ట్ మొబిలిటీ.. స్టేడియం అనుభవాలు.. పారిశ్రామిక రోబోటిక్స్.. రవాణా సాంకేతికతల వంటి ఆధునిక రంగాలపై ‘ఐఎంసీ-2026 నిశిత దృష్టి
‘ఐఎంసీ-2026’లో వందకు పైగా దేశాల ప్రాతినిధ్యం
నాడు పోస్టు చేయడమైనది:
07 OCT 2026 12:45PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని యశోభూమి వేదికగా ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 10వ మహాసభకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అక్టోబరు 8న ఉదయం సుమారు 10 గంటలకు శ్రీకారం చుడతారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతినిధులు, సభికులనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
“అవధుల్లేని విస్తరణ” ఇతివృత్తంగా టెలికమ్యూనికేషన్స్ విభాగం (డీఓటీ), సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) సంయుక్తంగా నిర్వహించే ఈ మహాసభ వాస్తవంగా ఇవాళ మొదలై 10వ తేదీ వరకూ కొనసాగుతుంది. డిజిటల్ ఆవిష్కరణలు, భావితరం సంధానం, సాంకేతికాధారిత వృద్ధిలో భారత్ సామర్థ్యం ఇనుమడించడాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
ఈ మహాసభకు- “సృష్టి: భవిష్యత్తుకు రూపకల్పన, సంవర్ధన్: వృద్ధికి నవ్యోత్తేజం, సశక్త్: అవకాశాల విస్తరణ, సురక్ష: విశ్వసనీయత బలోపేతం” నాలుగు కీలక మూలస్తంభాలుగా ఉంటాయి. ఇది ఆవిష్కరణలు, భవిష్యత్తరం డిజిటల్ మౌలిక సదుపాయాలు, సాంకేతికత ఆధారిత ఆర్థిక వృద్ధి, సమ్మిళిత డిజిటల్ సౌలభ్యం, సురక్షిత-పటిష్ట డిజిటల్ వ్యవస్థల రూపకల్పనపై ఈ మహాసభ దృష్టి సారిస్తుంది. డిజిటల్ వ్యవస్థ అంతటా ఉద్భవిస్తున్న అవకాశాల అన్వేషణ దిశగా ప్రపంచ సాంకేతిక అగ్రగాములు, విధాన రూపకర్తలు, పరిశ్రమ నిపుణులు, అంకురాలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను ఐఎంసీ-2026 ఒకే వేదికపైకి తెస్తుంది.
ఐదో తరం, 6వ తరం, భవిష్యత్ ఏఐ నెట్‌వర్కులు, సెమీకండక్టర్లు, నాన్-టెరెస్ట్రియల్ నెట్‌వర్కులు, సైబర్ భద్రత, క్వాంటం కమ్యూనికేషన్, వాణిజ్య సంస్థల రూపాంతరీకరణ, వర్తుల ఆర్థిక వ్యవస్థ, ఈఎస్‌జీ, ఎలక్ట్రానిక్స్ తయారీ సహా 9 నిర్దిష్ట పునాదులుగల రంగాలు ఈ మహాసభలలో ప్రధాన చర్చనీయాంశాలుగా ఉంటాయి. మరోవైపు ఈ కార్యక్రమంలో భాగంగా అత్యధునిక రవాణా, డియం అనుభవాలు, పారిశ్రామిక రోబోటిక్స్, రవాణా సాంకేతికత అనే నాలుగు కొత్త రంగాలకూ ఈ మహాసభ విస్తరిస్తుంది.
అసారి సైన్స్ కాంగ్రెస్‌లో 100కు పైగా దేశాల నుంచి 1.5 లక్షల మంది పాలుపంచుకుంటారని అంచనా. వీరిలో 500 మందికిపైగా భాగస్వాములు, ప్రదర్శన సంస్థలు, 600కు పైగా అంకుర సంస్థలు, 900 మందికిపైగా నిపుణ మేధావులు ఈ మహాసభలకు హాజరవుతారని అంచనా. ఇక సుమారు 2,000 దాకా సాంకేతిక పరిజ్ఞాన వినియోగ నిదర్శనాలపై 120కి పైగా చర్చాగోష్ఠులలో విశ్లేషణ సాగుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2320076)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Tamil
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Gujarati
,
Kannada
,
Malayalam