రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భారత నౌకాదళ నౌకల కోసం బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్, లాంచర్ల కొనుగోలుకు రూ. 661 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్న రక్షణ శాఖ

నాడు పోస్టు చేయడమైనది: 06 OCT 2026 1:35PM by PIB Hyderabad

‘బై (ఇండియన్ - ఐడీడీఎం)’ విభాగం కింద.. 2026 అక్టోబర్ 6న న్యూఢిల్లీలో భారత నౌకాదళ నౌకల కోసం బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్, లాంచర్ల కొనుగోలుకు సంబంధించి బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఏపీఎల్)తో రక్షణ మంత్రిత్వశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 661.50 కోట్ల విలువైన ఈ ఒప్పందంపై రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు చేశారు.

 

కనీసం 68 శాతం దేశీయ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు.. ఎంఎస్ఎంఈలు సహా వివిధ భారతీయ పరిశ్రమల క్రియాశీల భాగస్వామ్యాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. మూడేళ్ల కాలంలో విస్తృత ఉపాధి అవకాశాలను ఈ ప్రాజెక్టు కల్పిస్తుంది. దేశ నౌకావాణిజ్య భద్రతా వ్యవస్థను, రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా.. అధునాతన సైనిక సాంకేతికతలో దేశీయీకరణ దిశగా సాగుతున్న ప్రయత్నాల్లో ఇదొక కీలక మైలురాయిగా నిలుస్తుంది.

 

వివిధ అధునాతన యుద్ధనౌకల్లో అమర్చిన బ్రహ్మోస్ వ్యవస్థ.. నౌకా వాణిజ్య దాడుల సంబంధిత కార్యకలాపాల్లో భారత నౌకాదళానికి చెందిన ముఖ్యమైన ఉపరితల - ఉపరితల క్షిపణి (ఎస్ఎస్ఎం) వ్యవస్థగా నిలుస్తోంది. సూపర్‌సోనిక్ వేగంతో సుదూర ప్రాంతాల్లోని భూ ఉపరితల, సముద్ర ఆధారిత లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యం ఈ ఆయుధ వ్యవస్థ సొంతం.  

***


(రిలీజ్ ఐడి: 2319887) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Gujarati , Tamil