ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

40 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు

నాడు పోస్టు చేయడమైనది: 02 OCT 2026 7:22PM by PIB Hyderabad

నాలుగు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

అద్భుతమైన నైపుణ్యం, సమష్టి కృషి ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. జట్టు ప్రదర్శించిన దృఢ సంకల్పం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.

భారత మహిళల హాకీ జట్టు భవిష్యత్తు ప్రయత్నాలకు శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం దేశవ్యాప్తంగా హాకీ క్రీడకు మరింత ప్రజాదరణ తీసుకురావడానికి దోహదపడుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా చేసిన పోస్టులో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.

‘‘భారత హాకీకి ఇది ఎంతో ప్రత్యేకమైన సందర్భం.

నాలుగు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఆసియా క్రీడల్లో ప్రతిష్ఠాత్మక స్వర్ణ పతకాన్ని సాధించి స్వదేశానికి అందించిన మహిళల హాకీ జట్టు విజయంపై భారత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అద్భుతమైన నైపుణ్యం, సమష్టి కృషి ఫలితమే ఈ విజయం. వారి పట్టుదల ఎంతో స్ఫూర్తిదాయకం. హాకీ జట్టు భవిష్యత్తు ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు.

 

ఈ విజయం దేశవ్యాప్తంగా హాకీకి మరింత ప్రజాదరణ తీసుకురావడానికి దోహదపడాలి: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’  


(రిలీజ్ ఐడి: 2318414) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Gujarati