ఆర్థిక మంత్రిత్వ శాఖ
థాయిలాండ్ నుంచి వచ్చిన అంతర్జాతీయ పార్సిల్‌లో దాచి ఉంచిన 1.080 కిలోల హైడ్రోపోనిక్ వీడ్ (గాంజా).. జప్తు చేసిన సీబీఎన్ రాజస్థాన్ యూనిట్
నాడు పోస్టు చేయడమైనది:
02 OCT 2026 3:19PM by PIB Hyderabad
మాదక ద్రవ్యాలు, మానసిక రోగానికి దారితీసే పదార్థాల చట్టవ్యతిరేక క్రయ/విక్రయాలను, నిషిద్ధ వస్తువుల ఎగుమతి/దిగుమతులను అరికట్టే దిశగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సీబీఎన్)కు చెందిన జైపూర్ విభాగం తన ప్రయత్నాలను నిర్విరామంగా కొనసాగిస్తోంది. ఈ కృషిలో ఓ భాగంగా, జైపూర్ విదేశీ తపాలా కార్యాలయానికి (ఎఫ్‌పీఓ) చేరిన ఓ అంతర్జాతీయ పార్సిల్‌లో దాచి ఉంచిన 1.080 కిలోల హైడ్రోపోనిక్ వీడ్ (గాంజా)ను స్వాధీనం చేసుకుంది.
image.png
ఆపరేషన్లో జప్తు చేసిన హైడ్రోపోనిక్ వీడ్ (గాంజా)
థాయిలాండ్ నుంచి వచ్చిన ఒక అంతర్జాతీయ పార్సిల్‌లో మత్తు పదార్థాలను దాచిపెట్టారన్న అనుమానాస్పద వ్యవహారానికి సంబంధించి నిర్దిష్ట రహస్య సమాచారం అందడంతో, సందేహాస్పద పార్సిల్ విషయంలో దర్యాప్తు, సోదా చేపట్టడానికి సీబీఎన్ జైపూర్ విభాగం అధికారులు ఒక బృందాన్ని నియమించారు.
image.png
కార్య ప్రణాళికలో ఉపయోగించిన కేకులు
పార్సిల్‌ను ఆమూలాగ్రం పరిశీలించిన మీదట, కార్టన్ లోపల అనేక ప్యాకెట్లలో కేకులు, ఇతర వస్తువులను ఉంచిన సంగతిని అధికారులు గమనించారు. మరింత క్షుణ్నంగా పరీక్షించగా 29 కేకుల ప్యాకెట్లలో తెలివిగా హైడ్రోపోనిక్ వీడ్ (గాంజా)ను దాచి ఉంచిన విషయం బయటపడింది. ఈ నిషిద్ధ వస్తువును రహస్యంగా ఉంచే ప్రయత్నంలో దీనిని కేకు, ఇతర వస్తువుల ప్యాకెట్లతో కలిపి పెట్టినట్లు గుర్తించారు.
image.pngimage.png
కేకుల లోపలి భాగంలో హైడ్రోపోనిక్ వీడ్ (గాంజా)
గుప్తంగా ఉంచిన పదార్థాన్ని జాగ్రత్తగా స్వాధీనం చేసుకుని, తూకం వేశారు. మొత్తంమీద 1.080 కిలోల హైడ్రోపోనిక్ వీడ్ (గాంజా) ఉన్నట్లు తేలింది.
జప్తు చేసుకున్న నిషిద్ధ వస్తువును ఆ తరువాత నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రాపిక్ సబ్‌స్టెన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం-1985లోని సంబంధిత నిబంధనల ప్రకారం చట్ట ప్రక్రియను వర్తింప చేస్తూ, స్వాధీనపరుచుకున్నారు. అంతర్జాతీయ తపాలా కన్‌సైన్‌మెంట్ల ద్వారా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు చేసే యత్నాలను పసిగట్టి, అలాంటి నిషిద్ధ సామగ్రిని అది చేరాల్సిన గమ్యస్థానానికి చేరుకోకుండా చూడడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, సమన్వయపూర్వకంగా చేస్తున్న కృషిని ఈ ఉదంతం చాటిచెబుతోంది.
అంతర్జాతీయ కన్‌సైన్‌మెంట్లపై సీబీఎన్ గట్టి నిఘాను ఉంచుతోంది. మత్తు పదార్థాల చట్టవ్యతిరేక చేరవేతను నిరోధించడానికి నిర్దిష్ట రహస్య సమాచారం ఆధారంగా తగిన చర్యలు చేపడుతోంది. ఈ అక్రమ రవాణా కేసును మరింత నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2318387)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5