ప్రధాన మంత్రి కార్యాలయం
మహాత్మా గాంధీకి, లాల్ బహదూర్ శాస్త్రికి పుష్పాంజలి ఘటించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
02 OCT 2026 1:24PM by PIB Hyderabad
మహాత్మా గాంధీకి రాజ్‌ఘాట్‌లోను, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రికి విజయ్ ఘాట్‌లోను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుష్పాంజలి ఘటించారు.
వారు ఇద్దరి జీవితాలూ సీదాసాదాతనం, ధైర్యం, దేశానికి చేసిన సేవ పరంగా తరాల తరబడి ప్రేరణను అందిస్తూన ఉంటాయని శ్రీ మోదీ అన్నారు.
వారి ఆదర్శాలు, భారత్ ప్రగతి పట్ల వారికి ఉన్న తిరుగులేని నిబద్ధత ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ:
‘‘మహాత్మా గాంధీ కి రాజ్‌ఘాట్‌లో, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారికి విజయ్ ఘాట్‌లో ప్రధానమంత్రి నివాళులు అర్పించాను.
సీదాసాదాతనం, ధైర్యం, దేశ సేవకు ప్రతీకగా నిలిచిన వారి జీవితాలు తరాల తరబడి స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయి.
వారి ఆదర్శాలు, భారతదేశ ప్రగతి పట్ల వారు కనబరిచిన అచంచల నిబద్ధత మనకందరికీ మార్గదర్శకం’’ అని పేర్కొంది
(రిలీజ్ ఐడి: 2318370)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam