పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు

పరివర్తన ప్రధాన పాలన సంస్కరణలపై చర్చ;
‘సబ్‌కీ యోజనా, సబ్‌కా వికాస్’ పేరిట 2026-27 పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ ‌కు శ్రీకారం

గ్రామ సభ చర్చల్లో ప్రధానంగా పౌరసేవా పథకాలు, కార్యక్రమాలపై చర్చించనున్న పలు మంత్రిత్వ శాఖలు, విభాగాలు

నాడు పోస్టు చేయడమైనది: 01 OCT 2026 12:52PM by PIB Hyderabad

దేశమంతటా 2 అక్టోబరు 2026న ప్రత్యేక గ్రామ సభలను ఏర్పాటు చేయనున్నారు. పంచాయతీలను బలోపేతం చేస్తున్న సార్వజనిక సేవలను మెరుగుపరచడంతో పాటు గ్రామీణ భారత్‌లో జీవిత నాణ్యతను పెంచుతున్న పరివర్తన ప్రధాన పాలన సంస్కరణలు, కార్యక్రమాలపై ఈ గ్రామ సభలలో చర్చించనున్నారు. ‘సబ్‌కీ యోజనా, సబ్‌కా వికాస్’ పేరిట 2026-27 పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ (పీపీసీ)ను కూడా ఈ ప్రత్యేక గ్రామ సభల సందర్భంగా ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా గ్రామ పంచాయతీలు 2027-28 ఆర్థిక సంవత్సరానికి గాను తమ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను (జీపీడీపీస్) కూడా రూపొందిస్తాయి. దీని కోసం గ్రామ పంచాయతీలు ప్రాతినిధ్యపూర్వక, ఫలితాలను రాబట్టడం ప్రధానంగా ఉండే ప్రణాళికలను సిద్ధం చేస్తాయి. ఈ గ్రామ సభల చర్చల్లో పౌరులు, స్థానిక ప్రతినిధులు సమావేశమవుతారు. వారు కీలక ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలను, అమలు తీరును సమీక్షిస్తారు. స్థానిక అవసరాలను, లోటుపాట్లను గుర్తించి, తమ గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యాల ప్రాధాన్యతలపై చర్చిస్తారు.

Hide quoted text

 

క్షేత్ర స్థాయిలో అభివృద్ధి సాధనకు అనుసరిస్తున్న ‘సంపూర్ణ ప్రభుత్వ’ దృక్పథంలో భాగంగా ఈ చర్చలకు పంచాయతీ రాజ్ శాఖ కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతో కలిసి తోడ్పాటును అందిస్తుంది. ప్రత్యేక గ్రామ సభల్లో ఈ కింది పథకాలు, కార్యక్రమాల ప్రస్తావన చోటుచేసుకొంటుంది:

     • పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ:

ఆర్థిక సంఘం గ్రాంట్ల ద్వారా పంచాయతీలను బలోపేతం చేయడం;

రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్‌లో భాగంగా సామర్థ్యాలను పెంచడం;

ఈ-గ్రామ్‌స్వరాజ్ (eGramSwaraj), ఆడిట్‌ఆన్‌లైన్ (AuditOnline)ల ద్వారా డిజిటల్ మాధ్యమ పాలన;

వన్ సోర్స్ రెవెన్యూ (ఓఎస్ఆర్) సంబంధిత కార్యక్రమాలు;

‘స్వామిత్వ’;

పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్.

     • గ్రామీణాభివృద్ధి విభాగం: స్థానికంగా ఖరారు చేసిన పనులు, బతుకుదెరువులకు ఉద్దేశించిన ‘వికసిత్ గ్రామ పంచాయత్ ప్రణాళిక’;

125 రోజుల పాటు వేతనంతో కూడిన ఉపాధికి చట్టబద్ధ హామీని అందించే వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) [ వీబీ- జీ ఆర్ఏఎమ్ జీ].

     • తాగునీరు, పారిశుధ్య విభాగం:

గ్రామీణ గృహాలకు నల్లా నీటి కనెక్షన్‌ను అందించడానికి ఉద్దేశించిన ‘జల్ జీవన్ మిషన్’;

పారిశుధ్య పరిరక్షణకు సంకల్పించిన స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్);

ఓడీఎఫ్ ప్లస్;

ఘన వ్యర్థాల నిర్వహణ;

ద్రవ వ్యర్థాల నిర్వహణ.

     • జల వనరులు, నదుల అభివృద్ధి, గంగా నది జలాల శుద్ధి విభాగం:

జల్ సంచయ్ జన్ భాగీదారీ;

భూగర్భ జలాలు పుంజుకొనేటట్లు చూడటం కోసం వర్షం నీటిని ఒడిసిపట్టడం, పరీవాహక ప్రాంతాల మధ్య స్థలాన్ని (వాటర్‌షెడ్) పునరభివృద్ధిపరచడానికి ఉద్దేశించిన నియమాల్లో సవరణలు;

జల సంరక్షణ;

జల భద్రత.

     • ఆహార, ప్రజా పంపిణీ విభాగం: ఆహారధాన్యాలను అందుకొనే హక్కును సులభంగా మార్పిడి చేసుకోవడానికి ప్రవేశపెట్టిన ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్’ పథకంతో పాటు

నిరంతర ఆహార భద్రతకు ఉద్దేశించిన ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న్ యోజన’.

     • వినియోగదారు వ్యవహారాల విభాగం:

వినియోగదారుల్లో అవగాహనను పెంచడం, ఫిర్యాదుల పరిష్కారం, వినియోగదారులకు న్యాయాన్ని అందజేయడం కోసం తీసుకువచ్చిన జాతీయ వినియోగదారు హెల్ప్‌లైన్;

ఈ-జాగృతి (e-Jagriti).

     • భూ వనరుల విభాగం:

డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్‌స్ మాడర్నైజేషన్ ప్రోగ్రామ్ (డీఐఎల్‌ఆర్ఎమ్‌పీ) పరిధిలో డిజిటల్ రూపంలో భూ రికార్డుల సౌలభ్యం;

ఆస్తి హక్కులకు భద్రత;

రుణాలు తేలికగా లభిస్తున్న తీరు;

ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన’లో భాగంగా పరీవాహక ప్రాంతాల మధ్య స్థలాన్ని పునరభివృద్ధిపరచడం.

‘పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్‌’ను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2018 నుంచి అమలు చేస్తున్నారు. దీంతో విస్తృత, సమ్మిళిత, ప్రాతినిధ్యపూర్వక అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడంలో పంచాయతీలకు తోడ్పాటు లభిస్తోంది. 2.55 లక్షల కన్న ఎక్కువ గ్రామ పంచాయతీలు తమ తమ ప్రణాళికలను రూపొందించి, ఈ-గ్రామ్‌స్వరాజ్ (eGramSwaraj)లో అప్‌లోడ్ చేశాయి. స్థానిక అభివృద్ధిలో కీలక రంగాల్లో సాధించిన విజయాలు, ఎదుర్కొంటున్న లోటుపాట్లను పంచాయతీలు గుర్తించేందుకు పంచాయతీ ప్రగతి సూచీ (పంచాయత్ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్) దోహదం చేస్తున్నది. దీంతో, గ్రామ సభకు రాబోయే సంవత్సర ప్రాధాన్యాలను ఖరారు చేసి సంకల్పాన్ని చెప్పుకోవడానికి ఒక ఆధారం లభిస్తోంది. ప్రభుత్వ పథకాల విషయంలో పౌరులు తమ అనుభవాలను, స్పందనను, సూచనలను, సలహాలను పౌరులు అందించేందుకే కాకుండా, స్థానిక ప్రాధాన్యాలను నిర్ధారించడానికి కూడా ఒక వేదికగా గ్రామ సభ ఉపయోగపడుతున్నది. నేర విచారణకు తీసుకు వచ్చిన కొత్త చట్టాలు ‘భారతీయ న్యాయ సంహిత’, ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’, ‘భారతీయ సాక్ష్య అధినియమ్‌’లతో పాటు డిజిటల్ పరివర్తన, సహకార సంఘాలను పటిష్టపరచడం, మహిళలు, బాలల ఆత్మగౌరవాన్ని పరిరక్షించడానికి తీసుకు వచ్చిన ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’, ‘నషా ముక్త్ భారత్ అభియాన్‌’ వంటి కార్యక్రమాలపై అవగాహనను ఈ చర్చలు పెంపొందిస్తాయి. ‘స్వచ్ఛతా హీ సేవా’ ముగింపు దశకు చేరుకోవడంతో, ‘ఘన వ్యర్ధాల నిర్వహణ నియమావళి-2026’ను గురించి కూడా అక్టోబర్ 2న గ్రామ సభల్లో చర్చించనున్నారు.

అక్టోబరు 2, 2026న నిర్వహించే ప్రత్యేక గ్రామ సభల్లో పాల్గొని, స్థానిక అవసరాలు, ఆకాంక్షలకు అద్దం పట్టే పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో తోడ్పాటును ఇవ్వాల్సిందిగా పౌరులను కోరుతున్నారు. ‘‘సబ్‌కీ యోజనా, సబ్‌కా వికాస్’’ ద్వారా గ్రామ సభలు ప్రాతినిధ్య పూర్వక పాలనను పటిష్టపరిచి, సశక్త్ పంచాయతీ, ఆత్మనిర్భర్ పంచాయతీ, వికసిత్ పంచాయతీల ఆవిష్కారానికి తోడ్పాటునిస్తూ అంతిమంగా ‘వికసిత్ భారత్’ ఆశయ సాధనకు సహకారాన్ని అందిస్తాయి.


(రిలీజ్ ఐడి: 2318145) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , Bengali , Bengali-TR , Odia , English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Telugu , Kannada