లోక్‌సభ సచివాలయం
లోక్‌సభ మాజీ స్పీకర్ శ్రీ జి.ఎమ్.సి. బాలయోగికి నివాళులు అర్పించిన లోక్‌సభ స్పీకర్
నాడు పోస్టు చేయడమైనది:
01 OCT 2026 3:03PM by PIB Hyderabad
లోక్‌సభ మాజీ స్పీకర్ శ్రీ జి.ఎమ్.సి. బాలయోగి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా ఆయనకు సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా శ్రీ బాలయోగి చిత్రపటానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్, పార్లమెంట్ సభ్యులు, మాజీ సభ్యులు, ఇతర ప్రముఖులు కూడా నివాళులు అర్పించారు.
లోక్‌సభ సెక్రటరీ-జనరల్ శ్రీ ఉత్పల్ కుమార్ సింగ్, రాజ్యసభ సెక్రటరీ-జనరల్ శ్రీ పి.సి. మోదీలు కూడా శ్రీ బాలయోగికి సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో నివాళులు అర్పించారు.
శ్రీ బాలయోగి పన్నెండో లోక్‌సభకు స్పీకర్‌గా వ్యవహరించారు. ఆయననను పదమూడో లోక్‌సభకు కూడా స్పీకర్‌గా ఎన్నుకున్నారు.
శ్రీ బాలయోగి చిత్రపటాన్ని శ్రీ హిమ్ చటర్జీ రూపొందించారు. దీనిని సంవిధాన్ సదన్ వెలుపలి లాబీలో అమర్చారు. 2014 ఫిబ్రవరి 10న అప్పటి రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ ఈ చిత్రపటాన్ని ఆవిష్కరించారు.
***
(రిలీజ్ ఐడి: 2317688)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5