ప్రధాన మంత్రి కార్యాలయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధానమంత్రి సంభాషణ
వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై సమీక్ష
భారత్ - అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నిబద్ధతను పునరుద్ఘాటించిన నేతలు
ప్రపంచ శాంతి, భద్రతను పెంపొందించే ప్రయత్నాలతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్న నేతలు
నాడు పోస్టు చేయడమైనది:
30 SEP 2026 7:20PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పలు అంశాలపై ఫోన్‌లో మాట్లాడారు.
వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతలు మొదలైన పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు.
భారత్ - అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ నిబద్ధతను ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం సహకారాన్ని మరింత విస్తరించేందుకు సన్నిహిత సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించారు.
ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇద్దరు నాయకులు అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రపంచ శాంతి, భద్రతను పెంపొందించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలపై చర్చించారు.
ఇక ముందు కూడా తరచూ పరస్పరం సంప్రదింపులను కొనసాగించాలని నిర్ణయించారు.
***
(రిలీజ్ ఐడి: 2317347)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8