ప్రధాన మంత్రి కార్యాలయం
2026 ఆసియా గేమ్స్‌లో మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన జ్యోతి సురేఖ వెన్నం, ప్రీతిక ప్రదీప్, చికిత తానిపర్తిలకు ప్రధాని అభినందన
నాడు పోస్టు చేయడమైనది:
30 SEP 2026 1:57PM by PIB Hyderabad
2026 ఆసియా క్రీడల్లో మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన జ్యోతి సురేఖ వెన్నం, ప్రీతిక ప్రదీప్, చికిత తానిపర్తిలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
అత్యుత్తమ ప్రదర్శనతో ప్రపంచ రికార్డును సమం చేస్తూ ఈ ఘనతను సాధించడం.. వారి విజయాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
మన ఆర్చర్ల అద్భుత ఘనతగా ఈ విజయాన్ని అభివర్ణించిన శ్రీ మోదీ.. జట్టు మొత్తానికీ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:
“భారత్‌కు మరో బంగారు పతకం!
2026 ఆసియా క్రీడల్లో మహిళల కాంపౌండ్ టీం విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన జ్యోతి సురేఖ వెన్నం, ప్రీతిక ప్రదీప్, చికిత తానిపర్తిలకు అభినందనలు. అద్భుత ప్రదర్శనతో ప్రపంచ రికార్డును సమం చేసిన వారి విజయం మరింత ప్రత్యేకమైనది. మన విలుకారులకు అద్భుత విజయమిది. భవిష్యత్తులో మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ.. భారత జట్టుకు శుభాకాంక్షలు: ప్రధానమంత్రి @narendramodi”
(రిలీజ్ ఐడి: 2317055)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam