ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడల్లో పురుషుల 5000 మీటర్ల పరుగు విభాగంలో కాంస్య పతకం సాధించిన గుల్వీర్ సింగ్‌కు ప్రధానమంత్రి అభినందన
నాడు పోస్టు చేయడమైనది:
29 SEP 2026 9:34PM by PIB Hyderabad
ఆసియా క్రీడల్లో పురుషుల 5000 మీటర్ల పరుగు విభాగంలో కాంస్య పతకం సాధించిన గుల్వీర్ సింగ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ క్రీడాకారుడికి ప్రస్తుత ఆసియా క్రీడలు ఎంతో ప్రత్యేకమైనవని ఆయన అభివర్ణించారు. ఈ విభాగంలో గుల్వీర్ సింగ్ వరుసగా మూడోసారి పతకం సాధించడం (హ్యాట్రిక్ ఆఫ్ పోడియం ఫినిష్) ద్వారా అద్భుత ప్రతిభను రుజువు చేసుకున్నాడని కొనియాడారు.
అతని స్థిరమైన ప్రతిభా ప్రదర్శన, ఓరిమితోపాటు దృఢ సంకల్పానికి ఇది నిదర్శనమని శ్రీ మోదీ ప్రశంసించారు,
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఈ సారి ఆసియా క్రీడలు గుల్వీర్ సింగ్‌కు నిజంగా ఎంతో ప్రత్యేకం! పురుషుల 5000 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించిన అతనికి నా హృదయపూర్వక అభినందనలు. వరుసగా మూడోసారి (హ్యాట్రిక్) పతక విజేతగా నిలవడం అసాధారణం. క్రీడలో అతని స్థిరత్వం, ఓరిమి, పట్టుదల ప్రశంసనీయం. భవిష్యత్తులోనూ అతడు మరింత మెరుగైన విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది.
***
(రిలీజ్ ఐడి: 2316829)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam