ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడల్లో మహిళల లాంగ్ జంప్ పోటీలో రజత పతకాన్ని గెలిచిన అన్సీ సోజన్... ప్రధానమంత్రి అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
27 SEP 2026 8:33PM by PIB Hyderabad
ఆసియా క్రీడల్లో మహిళల లాంగ్ జంప్ పోటీలో రజత పతకాన్ని గెలిచిన అన్సీ సోజన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.
అన్సీ సోజన్ ప్రబలమైన, ఉత్సాహపూరితమైన ఆటతీరును చూసి దేశ ప్రజలు ఎంతో సంతోషించారని ప్రధానమంత్రి అన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని శ్రీ మోదీ అభిలషిస్తూ, శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ:
‘‘ఆసియా క్రీడల్లో మహిళల లాంగ్ జంప్ పోటీలో రజత పతకాన్ని గెలిచిన అన్సీ సోజన్‌కు అభినందనలు. శక్తిమంతమైన, ఉత్సాహపూరితమైన ఆమె ఆటతీరును చూసి దేశ ప్రజలు ఎంతో సంతోషించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ’’ అని తెలిపింది.
(రిలీజ్ ఐడి: 2315981)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam