ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల్లో మహిళల 200 మీ. పరుగు పందెం విభాగంలో కాంస్య పతకం సాధించిన హరిత భద్రకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 27 SEP 2026 8:29PM by PIB Hyderabad

ఆసియా క్రీడల్లో మహిళల 200 మీ. పరుగు పందెం విభాగంలో కాంస్య పతకం సాధించిన హరిత భద్రకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ఆసియా క్రీడల్లో మొదటి ప్రయత్నంలోనే ఆత్మ విశ్వాసంతో, పట్టుదలతో పరుగు పందెంలో హరిత భద్ర విజేతగా నిలిచిందని ప్రధానమంత్రి కొనియాడారు. ఈ అద్భుతమైన విజయం పట్ల ఆమెకు అభినందలు తెలిపారు. ఆమె విజయానికి భారత్ గర్వపడుతుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.

"ఆసియా క్రీడల్లో మహిళల 200 మీ. పరుగు పందెం విభాగంలో అద్భుతంగా రాణించి హరిత భద్ర కాంస్య పతకాన్ని సాధించారు! మొదటి ప్రయత్నంలోనే ఆత్మ విశ్వాసంతో, పట్టుదలతో ప్రదర్శన చేసి ఆసియా క్రీడల వేదికపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ అద్బుతమైన విజయం సాధించినందుకు ఆమెకు అభినందనలు. ఆమె విజయం పట్ల భారత్ గర్వపడుతోంది: పీఎం శ్రీ నరేంద్ర మోదీ".


(రిలీజ్ ఐడి: 2315978) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam