ప్రధాన మంత్రి కార్యాలయం
మహిళల సాండా 60 కేజీ ఈవెంట్‌లో రజత పతకాన్ని నోరమ్ రోశిబినా దేవి గెలుచుకున్నందుకు అభినందించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
24 SEP 2026 11:19AM by PIB Hyderabad
మహిళల సాండా 60 కిలోల పోటీలో రజత పతకాన్ని గెలుచుకున్న నోరమ్ రోశిబినా దేవిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.
వరుసగా మూడు ఆసియా క్రీడల్లో పతకాలు గెలుచుకోవడం ప్రశంసాపూర్వక విజయమని ప్రధానమంత్రి అన్నారు. రోశిబినా దేవి నిలకడతనం, సాహసం, దృఢసంకల్పం నిజంగా కొనియాడదగినవని ప్రధాని అన్నారు. ఆమె భావి ప్రయత్నాల్లో రాణించాలని శ్రీ మోదీ కోరుకుంటూ, శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ, ఇలా పేర్కొంది:
‘‘మహిళల సాండా 60 కేజీ ఈవెంట్‌లో రజత పతకాన్ని నోరమ్ రోశిబినా దేవి గెలుచుకున్నందుకు అభినందనలు. వరుసగా 3 ఆసియా క్రీడల్లో పతకాలు సాధించడం ప్రశంసనీయ విజయం. ఆమె నిరంతరత్వం, సాహసం, పట్టుదల నిజంగా మెచ్చుకోదగినవి.
రాబోయే కాలంలో కూడా ఆమె రాణించాలని నేను ఆకాంక్షిస్తున్నాను: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ’’.
***
(రిలీజ్ ఐడి: 2314344)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Malayalam