ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పురుషుల డబుల్ స్కల్స్‌లో కాంస్యం సాధించిన సత్నామ్ సింగ్, సల్మాన్‌ఖాన్‌కు ప్రధాని అభినందనలు

నాడు పోస్టు చేయడమైనది: 24 SEP 2026 9:50AM by PIB Hyderabad

పురుషుల డబుల్ స్కల్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి, దేశం కోసం కాంస్య పతకాన్ని సాధించిన సత్నామ్ సింగ్, సల్మాన్ ఖాన్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు. ఈ విజయానికి వారు అర్హులని తెలిపారు.

వారి సంయమనం, సమన్వయం ప్రత్యేకంగా నిలిచాయని ప్రధానమంత్రి అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకొనేలా ఈ విజయం వారికి స్ఫూర్తిని అందిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘
పురుషుల డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నాం సింగ్, సల్మాన్ ఖాన్ చేసిన అద్భుత ప్రదర్శనతో భారత్‌ కాంస్య పతకాన్ని సాధించింది. ఈ విజయానికి వారు అర్హులు

వారి సంయమనం, సమన్వయం ప్రత్యేకంగా నిలిచాయి. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకొనేలా వారికి ఈ విజయం  స్ఫూర్తిని అందించుగాక: పీఎం నరేంద్రమోదీ’’

***


(రిలీజ్ ఐడి: 2314342) సందర్శకుల సూచీ సంఖ్య : : 12