ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

ఆరోగ్యవంతమైన, సమతూకంతో కూడిన జీవితం కోసం అనుసరించాల్సిన సమగ్ర విజ్ఞానశాస్త్రంగా

ఆయుర్వేదం ఉందంటున్న సంస్కృత సుభాషితం..

ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 23 SEP 2026 10:25AM by PIB Hyderabad

ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

సాంప్రదాయిక వైద్య విధానంగా ఆయుర్వేదం కాల పరీక్షకు తట్టుకొని నిలిచిన జ్ఞానంగా అలరారుతోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఇది కేవలం ఒక చికిత్స విధానం కాదనీ, ఆరోగ్యకరమైన, సమతూకంతో కూడిన జీవితశైలిని సూచించే ఓ ప్రభావవంతమైన మాధ్యమమని ఆయన అన్నారు.  ఈ సంపన్న వారసత్వాన్ని అనుసరించాలన్న సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ బలోపేతం చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఆయుర్వేద సమగ్ర స్వభావాన్ని ప్రస్ఫుటం చేసే ఓ సంస్కృత సుభాషితాన్ని ఈ సందర్భంగా ప్రజలతో శ్రీ మోదీ  పంచుకున్నారు.

సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హార్దిక శుభకామనలు. ఆయుర్వేదం కేవలం ఓ చికిత్స విధానం కాదు..  ఇది ఆరోగ్యవంతమైన, సంతులిత జీవన శైలిని సూచించే ప్రభావవంతమైన మాధ్యమం. రండి.. మన ఈ సంపన్న వారసత్వాన్ని అనుసరించుదామన్న  సంకల్పాన్ని మరింత బలోపేతం చేద్దాం.

హితాహితం సుఖం దుఃఖమాయుస్తస్య హితాహితమ్

మానం చ తచ్చ యత్రోక్తమాయుర్వేదః స ఉచ్యతే’’ అని పేర్కొన్నారు.

ఏ విధమైన జీవనశైలి మానవులకు ప్రయోజనకరమో,

సంతోషదాయకమైన జీవితం లేదా అసంతృప్తికరమైన జీవితం అంటే ఏమిటో,

స్వస్థ జీవితం, రోగ జీవితం.. ఈ రెంటి మధ్య ఉన్న తేడాలు ఏమేమిటో,

దీర్ఘ కాలం పాటు ఆరోగ్యంగా జీవించాలంటే దేనిని అనుసరించాలో, దేనిని అనుసరించ కూడదో,

జీవనకాల ప్రకృతి, స్థాయులపై దేనిలో విస్తృతంగా చర్చ జరుగుతోందో.. 

అలాంటి విజ్ఞానశాస్త్రమే ఆయుర్వేదమని ఈ సుభాషితం మనకు బోధిస్తోంది

 

***


(రిలీజ్ ఐడి: 2313792) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam