రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో భారత నావికాదళ తొలి అత్యాధునిక క్షిపణి నౌక (ఎన్‌జీఎంవీ) నిర్మాణం ప్రారంభం

నాడు పోస్టు చేయడమైనది: 19 SEP 2026 11:46AM by PIB Hyderabad

భారత నౌకాదళానికి చెందిన తొలి 'నెక్స్ట్ జనరేషన్ క్షిపణి నౌక' (ఎన్‌జీఎంవీ) నిర్మాణ పనులు కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఈ నెల 18న అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి నౌకాదళ ఉత్పత్తి, కొనుగోలు విభాగ నియంత్రణాధికారి వైస్ అడ్మిరల్ సంజయ్ సాధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో భారత నౌకాదళం, కొచ్చిన్ షిప్‌యార్డ్‌కు చెందిన పలువురు ఉన్నతాధికారులూ పాల్గొన్నారు.

మార్చి-2023లో ఎన్‌జీఎంవీల నిర్మాణానికి సంబంధించి సీఎస్ఎల్‌తో ఒప్పందం కుదిరింది. అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లతో వీటిని నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. ఇవి భారత నౌకాదళాన్ని 'భవిష్యత్తుకు సిద్ధమైన, యుద్ధానికి సంసిద్ధంగా ఉన్న దళం' గా మెరుగుపరుస్తూ, సైన్యం పోరాట సామర్థ్యాలనూ గణనీయంగా పెంపొందిస్తాయి.

ఈ క్షిపణి నౌకల నిర్మాణం... హిందూ మహాసముద్ర ప్రాంతంలోని సవాలుతో కూడిన పరిస్థితులను ఎదుర్కోవడం కోసం ఒక బలమైన, ఆధునికమైన నౌకాదళాన్ని నిర్మించడం పట్ల భారత్ నిబద్ధతను మరింత బలపరుస్తుంది.

ఈ ప్రాజెక్ట్ భారత రక్షణ రంగ సొంత తయారీ సామర్థ్యాలనూ చాటుతోంది. ఈ నౌకల్లో వాడే ప్రధానమైన, కీలకమైన రక్షణ పరికరాలన్నింటినీ భారత్‌లోనే సొంతంగా అభివృద్ధి చేసి, తయారు చేస్తున్నారు. ఇది భారత ప్రభుత్వ 'స్వయం-సమృద్ధ భారత్', 'మేక్ ఇన్ ఇండియా - మేక్ ఫర్ ది వరల్డ్' దార్శనికతలకు అనుగుణంగా ఉంది.

 

***


(రిలీజ్ ఐడి: 2312457) సందర్శకుల సూచీ సంఖ్య : : 20
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil